'నీ ఆస్తి మొత్తం నా బాత్‌రూం విలువ చేయదు’: హీరోయిన్ ను అవమానించిన స్టార్ హీరో
Tollywood: సినిమా ఇండస్ట్రీలో తనతోపాటు పనిచేసే నటీనటులకు తగిన గౌరవం ఇస్తారు. ఇక హీరో హీరోయిన్ రిలేషన్ వేరేలా ఉంటుంది. ఒక్కరి పట్ల ఒక్కరి గౌరవం, అభిమానం వేరే లెవల్ లో ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఓ స్టార్ హీరోతో చేత అవమానించబడిందట. పనిచేస్తున్న సెట్ లోనే ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? మీరు కూడా ఓ లూక్కేయండి.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందాల నటుడు, సోగ్గాడు దివంగత నటుడు శోభన్ బాబు. అప్పటో ఆయన కున్న క్రేజ్ అంతఇంత కాదు. ఆయనకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి ముఖ్యంగా ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ఆయన ప్రతివారితోనూ నవ్వుతూ.. నవ్విస్తూ సరదాగా ఉండేవారు. తనతో పాటు చేసే హీరోయిన్ తో చాలా మర్యాదగా, గౌరవంగా మెదిలేవారట. కానీ ఓ హీరోయిన్ విషయంలో మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యారట.

శోభన్ బాబుకు అంతగా కోపం తెప్పించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తనే నటి నగ్మా. ఈ బ్యూటీ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను మెచ్చింది. ఇటు టాలీవుడ్ లోనూ.. అటు బాలీవుడ్ లోనూ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తనకున్న క్రేజ్ తో పొలిటికల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇదెలా ఉంటే.. ఓ సారి ప్రముఖ హీరోయిన్ నగ్మా పై స్టార్ హీరో శోభన్ బాబు ఫైర్ అవుతూ ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే... స్టార్ హీరో, హీరోయిన్లు శోభన్ బాబు- నగ్మా ఇద్దరూ కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించారు ఆ సినిమాలనే అడవి దొంగ. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా.. ఒక పాటను అవుట్ డోర్ లో చిత్రీకరించాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయ్యారంట. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్,కొరియోగ్రాఫర్,కెమెరామెన్స్ మూవీ యూనిట్ మొత్తం సిద్దమైందట. కానీ, హీరోయిన్ నగ్మా మాత్రం షూటింగ్ కి రాలేదు. ఎంతో బిజీ షెడ్యూల్ లో హీరో శోభన్ బాబు కూడా దాదాపు రెండు గంటల సేపు వేయిట్ చేశారంట.

నెమ్మదిగా సెట్ కు చేరుకున్నది హీరోయిన్ నగ్మా. మూవీ మేకర్స్ ..' ఏమైందమ్మా.. ఎక్కడికి వెళ్లావు?' అని అడగ్గా ఆమె సమాధానం చెప్పకుండా అతిగా ప్రవర్తించిందట. ఈ విషయాన్ని గమనించిన హీరో శోభన్ బాబు.. నగ్మా తిక్క కుదార్చారట. మొండిగా వ్యవహరించిన నగ్మాను శోభన్ బాబు పిలిచి.. 'నీ ఆస్తి ఎంత ఉంటుంది? అని ప్రశ్నించారట. దానికి నగ్మా ఏదో సమాధానం చెప్పిందట.
'నీ మొత్తం ఆస్తి నా ఇంట్లోని బాత్రూం ఖరీదు కూడా చేయదు. మొదట సమయపాలన నేర్చుకో.. సమయాన్ని అనుసరించు.. వర్క్ పై ఫోకస్ చేస్తేనే సక్సెస్ సాధిస్తావ్. ఇండస్ట్రీలో నాలుగు రోజులు ఉంటావ్.. లేకపోతే వెళ్ళిపోతావు' అంటూ ఓ రేంజ్ లో ఇచ్చిపాడేశాడరంట. ఇక ఇందుకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ మహానీయుడు చెప్పినట్టు నడుచుకుంది కాబట్టే.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా.. శోభన్ బాబు ఎంతో మందికి ఆదర్శప్రాయుడుగా, మార్గదర్శకుడుగా వ్యవహరించారనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











