శోభాయమానమైన మహాప్రస్ధానం
{image-shobhan babu_27032008.jpg telugu.filmibeat.com}శోభన్ బాబుకు కవితా నివాళి :
ఓనమాలతో మెదలై అక్షరమాలలై
పదగమనములై వాక్యములై
గ్రంధాలై పర్వాలై పురాణాలై
అందు వ్యక్తులవతరించి-ప్రకృతి శోయగాలతో
పట్టణాలై,ప్రజాలై,వ్యధలై-సంతోషాలై-అన్నీ అయి,
చివరి వాచ్యాన ఏమి మిగలనదైనది జీవితం.
వ్యక్తులు ప్రతిభను వొంటబట్టించుకొని
మంచితనం మేలిమిని నరాలకెక్కించుకొని
మాటలు అననయంగా జగమంతా పరచి
వాటిల్లో తానై,చిత్తరువై-రెండూ వొకటై
ఒకటి భౌతికాన దూరమై మరొకటియే మిగులును.
మంచి పనులు,మంచి మాటలే మిగిలి
శరీరం ధరిణిలో కలసి మాయమగును
అట్టి సమయమందు మంచి చెడుల విభజన జరుగును
పరిమళించేది మంచిదనం ధవళమై
దశదిశలా వ్యాపించును-మరొకటి చెప్పనలవి కాని
దుర్గంధ దౌర్బల్యం-నిరూపణలేల?
తల దిమ్మతిరిగే వార్త!
శోభనామయం అనంతంలో కలిసిందని
భౌతికరూపం ప్రకృతిలో లీనమౌతుందని
అన్నింటినీ త్వజించి మహాప్రస్ధానంలోకి నడిచిందని
ఎందరెందరో మహా ప్రఖ్యాత దురంధరులు
మాన్యులు-సామాన్యులు కలసి అన్నమాట
"మంచితనం-మాటతీయదనం-మర్మమరుగని
కలుపుగోలుతనం-నట వృత్తిలో
కల్మషం లేని పసిడిదనం-మన నట భూషణుడు
శోభన్ బాబు"
మరి అతివలు-చిరుమాన్యులు రాల్చిన కన్నీటి చుక్కలు
వర్షధారలై-చెన్నై నగర ప్రవాహాలైనాయి
అభిమానం ఎల్లలెరగనిది
అందుకే యీ అక్షర అశ్రునివాళి
రావులపాటి వేంకట రామారావు
హైదరాబాదు
[email protected]
cell: 98480 33150


Click it and Unblock the Notifications











