పవన్ కల్యాణ్‌కు, మాకు చేదు అనుభవం.. గుర్తు చేసుకున్న బాహుబలి నిర్మాత
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే సాహసాలు చేయడంతో పాటు టాలీవుడ్‌కు సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేశాడు. దీంతో కొన్ని విజయాలను అందుకున్నాడు. ఫలితంగా తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. చాలా కాలంగా ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని చూపిస్తున్న పవర్ స్టార్.. ఈ మధ్యనే రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో 'బాహుబలి' చిత్ర నిర్మాత.. పవన్‌తో సంబంధాల గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఆ వివరాలు మీకోసం.!

రాజకీయాల కోసం గ్యాప్.. లాయర్‌గా ఎంట్రీ
రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' అనే సినిమా ద్వారా ఆయన మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు
‘వకీల్ సాబ్' మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్.. మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనుండగా... రెండో దానిని హరీష్ శంకర్ రూపొందించనున్నాడు. మొదటి దానికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, రెండో దానిని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్' తర్వాత ఇవి పట్టాలెక్కుతాయి.

పవన్ వ్యూహాన్ని దెబ్బకొట్టిన మహమ్మారి
2024లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని పవన్ కల్యాణ్ భావించాడు. ఇందులో భాగంగానే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మరికొన్ని కథలు విన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ఆయన వ్యూహాన్ని దెబ్బకొట్టింది. దీంతో ప్లాన్ మొత్తం మారిపోయింది.

పవన్ రిలేషన్‌పై బాహుబలి నిర్మాత కామెంట్స్
పవన్ కల్యాణ్ అంటే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో సైతం చాలా మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఈ విషయం చాలా సార్లు సుస్పష్టమైంది. అందుకే ఎవరిని ఇంటర్వ్యూ చేసినా పవన్ గురించి ప్రశ్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో పవన్‌తో రిలేషన్‌పై బాహుబలి నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు.

మా ఫ్రెండ్ భార్య ద్వారా పవన్‌ను ఒప్పించాం
‘బాహుబలి' సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న వారిలో ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ఒకరు. ఈయన గతంలో కొన్ని చిత్రాలను నిర్మించారు. అందులో పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా' కూడా ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మా ఫ్రెండ్ భార్యకు పవన్ తెలుసు. ఆమె ద్వారానే ఈ సినిమాలో నటించేందుకు పవర్ స్టార్‌ను ఒప్పించాం' అని తెలిపారు.
Recommended Video

వాళ్లు చివరి నిమిషంలో నాకు హ్యాండిచ్చారు
ఇక, ఈ చిత్ర ఫలితం గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈ సినిమా వల్ల మాకు నష్టాలు వచ్చాయి. వాస్తవానికి దీనికి సహ నిర్మాతగా మరో సంస్థ కూడా ఉంది. కానీ, వాళ్లు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆ నష్టమంతా నేనే భరించా. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో పవన్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ వల్ల ఆయన మాకు బాగా క్లోజ్ అయ్యారు' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











