India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRRపై ఆస్కార్ విన్నర్ దారుణమైన కామెంట్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బాహుబలి ప్రొడ్యూసర్

  |

  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. 400 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1130 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. అయితే ఈ సినిమా బాగుందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాలేదనే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. కానీ ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఇండియన్ టెక్నీషియన్ ఒకరు సినిమా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  రౌద్రం రణం రుధిరం

  రౌద్రం రణం రుధిరం

  దర్శకుడు దీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో రూపొందిన ఈ సినిమాను తొలుత తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. అలాగే ఈ సినిమాని మరో అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి కనువిందు చేశాడు.

  400 కోట్ల బడ్జెట్ తో

  400 కోట్ల బడ్జెట్ తో

  ఇక రామ్ చరణ్ తేజ సరసన సీత పాత్రలో అలియా భట్ కనిపించగా ఎన్టీఆర్ సరసన జెన్నీ అనే పాత్రలో బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్ కనిపింది. అలాగే ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, మకరంద దేశ పాండే, చత్రపతి శేఖర్, అలిసన్ డూడ్లీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.. సబు సిరిల్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

  గే లవ్ స్టోరీ అంటూ

  గే లవ్ స్టోరీ అంటూ

  నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో ఇప్పుడు విదేశాల నుంచి కూడా సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే అడపాదడపా సినిమా బాగోలేదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన ఒక నార్త్ ఇండియా వ్యక్తి అయిన మనీష్ భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ ఒక చెత్త సినిమా అంటూ ట్విట్ చేశారు. ఆయన సాధారణ ప్రేక్షకుడి కాబట్టి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇండియన్ టెక్నీషియన్ గతంలో ఆస్కార్ అకాడమీ అవార్డు కూడా అందుకున్న రసూల్ పూకుట్టి ఆ ట్వీట్ ద్వారా ఆర్ఆర్ఆర్ సినిమా మీద తన అక్కసు వెళ్ళగక్కాడు. ఈ సినిమా ఒక గే లవ్ స్టోరీ అంటూ కామెంట్స్ చేశాడు.

  అసలేం బాలేదు అంటూ

  అసలేం బాలేదు అంటూ

  దీంతో అతని మీద సినీ అభిమానులు రకరకాలుగా స్పందిస్తుంటే రసూల్ కామెంట్స్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఘాటుగానే స్పందించారు. తాను కూడా సినిమా చూశానని ఆర్ఆర్ఆర్ ఒక గే లవ్ స్టోరీ అని తాను అనుకోవడం లేదని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. ఒకవేళ నిజంగానే అది ఆ గే లవ్ స్టోరీ అనుకుంటే గనక అందులో తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. అసలు మీరు చేసిన కామెంట్స్ ను సమర్థించుకుంటారా మీలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం అసలేం బాలేదు అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

   గే వాదాన్ని తెరమీదకి

  గే వాదాన్ని తెరమీదకి

  నిజానికి రాజమౌళి ఈ సినిమా గురించి పెట్టిన మొట్టమొదటి ప్రెస్ మీట్ లోనే ఈ సినిమాలో రొమాన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని మీడియా ప్రతినిధులకు ప్రశ్నించగా ఈ సినిమాలో రొమాన్స్ అనేది ఉండదని పూర్తిగా బ్రోమాన్స్ ఉంటుందంటూ రాజమౌళి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.. అంటే ఇందులో ఉన్న హీరోలు ఇద్దరు సోదర సమానులుగా భావిస్తూ ఉంటారని ఆయన చెప్పకనే చెప్పారు. కానీ సినిమా చూసిన తరువాత చాలామంది ఈ గే వాదాన్ని తెరమీదకి తీసుకువచ్చి అనవసరంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  English summary
  shobu yarlagadda strong counter to resul pookutty's comments on rrr as gay story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X