Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. RRR యూనిట్‌కు మరో షాక్
Recommended Video
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్రానికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. షూటింగ్ సరిగా జరుగుతూ అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో రాంచరణ్ గాయం కావడం, ఆ తర్వాత వెంటనే సినిమా నుంచి ఓ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం గందరగోళంగా మారాయట. తాజాగా ఎన్టీఆర్ గాయపడిన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
జూ ఎన్టీఆర్ చేతికి గాయం
మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు గాయం కావడంతో గుజరాత్ షెడ్యూల్‌ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షూటింగ్‌కు ఎన్టీఆర్ చేతికి కట్టుతో రావడం కనిపించింది. దాంతో షూటింగ్లో గాయపడ్డారనే వార్త ఫ్యాన్స్‌లో ఆందోళనకు కారణమైంది.
చేతికి కట్టుతోనే షూటింగ్‌కు
అయితే జూనియర్ ఎన్టీఆర్ కారు దిగుతున్న సమయంలో చేతిని ఓ పక్కకు పెట్టడం చూస్తే చేతికి ఓ మోస్తరు గాయమే అయినట్టు కనిపించింది. అయితే ఈ గాయం షూటింగ్లో జరిగిందా లేదా షూటింగ్ బయట జరిగిందా అనే విషయంపై యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
రాజమౌళికి షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. జక్కన ఆఫర్‌కు నో!
సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
ప్రస్తుతం గాయం తీవ్రతను పక్కన పెట్టి ఎన్టీఆర్ షూటింగ్‌కు హాజరవుతున్నట్టు సమాచారం. డాక్టర్ల సూచనలతో తారక్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. చేతికి కట్టుతో షూటింగ్‌కు హాజరైన ఎన్టీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
త్వరలోనే సెట్స్‌కు రాంచరణ్
RRRకు సంబంధించి గుజరాత్ షెడ్యూల్లో రాంచరణ్ గాయపడగా.. వైద్యులు మూడు వారాలా విశ్రాంతి అవసరం అని తేల్చారు. దాంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న రాంచరణ్ త్వరలో షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.
కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి వేట
ఇక బ్రిటీష్ అందాల తార డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం దర్శకుడు రాజమౌళి వేట కొనసాగిస్తున్నారు. శ్రద్ధాకపూర్ ఆఫర్‌ను తిరస్కరించిందనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రికమెండ్ చేసినట్టు సమాచారం. అయితే రాజమౌళి స్పందించారా అనే విషయంపై క్లారిటీ లేదు.