twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. RRR యూనిట్‌కు మరో షాక్

    |

    Recommended Video

    Jr Ntr Injured In RRR Movie Shooting || Filmibeat Telugu

    బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్రానికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. షూటింగ్ సరిగా జరుగుతూ అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో రాంచరణ్‌ గాయం కావడం, ఆ తర్వాత వెంటనే సినిమా నుంచి ఓ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం గందరగోళంగా మారాయట. తాజాగా ఎన్టీఆర్ గాయపడిన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

    జూ ఎన్టీఆర్ చేతికి గాయం

    జూ ఎన్టీఆర్ చేతికి గాయం

    మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు గాయం కావడంతో గుజరాత్‌ షెడ్యూల్‌ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షూటింగ్‌కు ఎన్టీఆర్ చేతికి కట్టుతో రావడం కనిపించింది. దాంతో షూటింగ్‌లో గాయపడ్డారనే వార్త ఫ్యాన్స్‌లో ఆందోళనకు కారణమైంది.

     చేతికి కట్టుతోనే షూటింగ్‌కు

    చేతికి కట్టుతోనే షూటింగ్‌కు

    అయితే జూనియర్ ఎన్టీఆర్ కారు దిగుతున్న సమయంలో చేతిని ఓ పక్కకు పెట్టడం చూస్తే చేతికి ఓ మోస్తరు గాయమే అయినట్టు కనిపించింది. అయితే ఈ గాయం షూటింగ్‌లో జరిగిందా లేదా షూటింగ్ బయట జరిగిందా అనే విషయంపై యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

    రాజమౌళికి షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. జక్కన ఆఫర్‌కు నో!రాజమౌళికి షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. జక్కన ఆఫర్‌కు నో!

    సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

    సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

    ప్రస్తుతం గాయం తీవ్రతను పక్కన పెట్టి ఎన్టీఆర్ షూటింగ్‌కు హాజరవుతున్నట్టు సమాచారం. డాక్టర్ల సూచనలతో తారక్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. చేతికి కట్టుతో షూటింగ్‌కు హాజరైన ఎన్టీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    త్వరలోనే సెట్స్‌కు రాంచరణ్

    త్వరలోనే సెట్స్‌కు రాంచరణ్

    RRRకు సంబంధించి గుజరాత్‌ షెడ్యూల్‌లో రాంచరణ్ గాయపడగా.. వైద్యులు మూడు వారాలా విశ్రాంతి అవసరం అని తేల్చారు. దాంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న రాంచరణ్ త్వరలో షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

    కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి వేట

    కొనసాగుతున్న దర్శకుడు రాజమౌళి వేట

    ఇక బ్రిటీష్ అందాల తార డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం దర్శకుడు రాజమౌళి వేట కొనసాగిస్తున్నారు. శ్రద్ధాకపూర్ ఆఫర్‌ను తిరస్కరించిందనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రికమెండ్ చేసినట్టు సమాచారం. అయితే రాజమౌళి స్పందించారా అనే విషయంపై క్లారిటీ లేదు.

    English summary
    Another Shock for RRR unit, After Ram Charan, Jr Ntr was injured. He attended shooting with bandage with Hand. NTR photos are going viral in social media. Unit not revealed and responded on this news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X