రెస్టారెంట్‌కు వెళ్లి బొక్కబోర్లా పడ్డ Baby Director.. అసలేం జరిగిందంటే?

దర్శకుడు సాయి రాజేష్ అంటే... బేబీ సినిమాకు ముందు అంతగా ఎవరికి తెలియకపోవచ్చు. ఆనంద్ దేవరకొండతో ఎప్పుడైతే బేబీ సినిమా తీశాడో... ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ఇక ఈ సినిమా కలెక్షన్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఇదిలా ఉంటే.. బేబీ మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న సాయి రాజేశ్... ఓ రెస్టారెంటుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు. అదేంటో తెలుసుకుందాం.

ఆ రెండు సినిమాలతో...:దర్శకుడు సాయి రాజేష్... ఇండస్ట్రీలోకి రావడం.. రావడమే... స్ఫూఫ్ మూవీలు తెరకెక్కించి.. డిఫరెంటు డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. బర్నింగ్ స్టార్ సంపుర్ణేష్ తో.. హృదయ కాలయం సినిమా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి... ఇదేం సినిమా రాబాబు.. ఇలా కూడా తీయొచ్చా అని విమర్శలు వచ్చాయి. ఇక కామెడీ స్ఫూఫ్ గా తెరకెక్కిన ఈ సినిమా... ఓ మాదిరిగా పర్వాలేదనిపించింది. కమర్షియల్ గా మాత్రం సాయి రాజేష్ కు హిట్ రాలేదు. కానీ కాస్త ఫేమ్ వచ్చింది. అటు సంపూర్ణెష్ కూడా ఈ సినిమాతో ఫేమ్ లోకి వచ్చాడు.

shock to Baby director Sai Rajesh who dished that the name was good in JapaneseRestaurant

కమర్షియల్ హిట్...:ఇక ఆ తర్వాత మళ్లీ సంపుర్ణెష్ తోనే కొబ్బరి మట్ట అనే స్ఫూఫ్ మూవీని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ ఈ సినిమా మీమ్స్, సీన్స్ ట్రోలింగ్ అవుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే... చాలా గ్యాప్ తీసుకుని ఈ సారి మంచి కథతో వచ్చాడు సాయి రాజేష్. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో బేబీ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. సాయి రాజేష్ కు మంచి కమర్షియల్ హిట్టును ఇచ్చింది.

shock to Baby director Sai Rajesh who dished that the name was good in JapaneseRestaurant

యూత్ కు కనెక్ట్...:ఈ సినిమా సాయి రాజేష్ కు మంచి పేరును తీసుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై ... పెను సంచలనం సృష్టిస్తోంది. విడుదలై 13 రోజులైనా... అటు వర్షంలోనూ కలెక్షన్ల వర్షం ఆగకుండా.. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 70కోట్లకు పైగానే వసూలు చేసిన ఈ మూవీ త్వరలో 100కోట్ల క్లబ్ లో చేరనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది.

shock to Baby director Sai Rajesh who dished that the name was good in JapaneseRestaurant

ఫుడ్ రాగానే షాక్...:ఇదిలా ఉంటే.. బేబీ డైరెక్టర్.. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇదే సక్సెస్ జోష్ తో ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లాడు సాయి రాజేష్. మామూలుగా మన ఇండియన్ ఫుడ్ తిని బోర్ కొట్టిందేమో... జపనీస్ రెస్టారెంటుకు వెళ్లాడు. అక్కడ ఓ డిష్ ఆర్డర్ పెట్టాడు. ఇక ఫుడ్ వస్తే.. ఎంజాయ్ చేద్దామని అనుకున్నాడు. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తే... ఆ ఫుడ్ రానే వచ్చింది. ఇక ఆ డిష్ చూసి సాయి రాజేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

shock to Baby director Sai Rajesh who dished that the name was good in JapaneseRestaurant

పేరు బాగుందని...:అయితే పేరు బాగుందని సాయి రాజేష్... ఓ డిష్ ను ఆర్డర్ పెట్టాడట. దాని కాస్ట్ 650 రూపాయలు. తీరా ఆ డిష్ వచ్చేసరికి కంగుతిన్నాడు రాజేష్. ఓ ప్లేట్ లో చిక్కుడు కాయలు పెట్టి తెచ్చాడు. పేరు బాగుందని ఆర్డర్ ఇస్తే.. ఇలా వచ్చిందని షాక్ అయి.. ఇలా సోషల్ మీడియాలో పంచుకున్నాడు సాయి రాజేష్. దీనికి నెటిజన్స్.. చిక్కుడు కాయలకు 650 రూపాయలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరు కూడా పేరు బాగుందని అర్డర్ పెట్టకండి.. తెలుసుకుని చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X