నాగబాబుకు జీవిత, రాజశేఖర్ గుణపాఠమా? ప్లేట్ ఫిరాయించి పవన్‌పై ఎటాక్.. మెగా బ్రదర్స్‌కు షాక్!
Recommended Video

టాలీవుడ్‌లో మెగా సోదరులకు మరోసారి జీవిత, రాజశేఖర్‌లు షాకిచ్చారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఓ వర్గాన్ని ఎదురించిన నాగబాబు.. ఈ సినీ దంపతులకు బహిరంగంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా వారి తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే తాజాగా జీవిత, రాజశేఖర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం సినీ, రాజకీయ వర్గాలకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే..

మా ఎన్నికల్లో పోటీ
మార్చి నెలలో టాలీవుడ్‌లో హోరాహెరీగా నటీనటుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. అత్యంత గందరగోళం మధ్య జరిగిన ఎన్నికల్లో జీవిత, రాజశేఖర్ దంపతులు పోటీలో నిలిచారు. అయితే శివాజీరాజా ప్యానెల్‌కు మెగా హీరోల మద్దతు ఉందనే ప్రచారం జరిగింది. ఎన్నికల్లో అదే ఊపు కనిపించింది.

జీవిత, రాజశేఖర్ దంపతులకు నాగబాబు మద్దతు
అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు అనూహ్యంగా నాగబాబు తన మద్దతును నరేష్ ప్యానెల్‌కు ఇచ్చారు. దాంతో ప్రత్యక్షంగా జీవిత, రాజశేఖర్‌కు మద్దతు తెలుపాల్సి వచ్చింది. మహిళలకు న్యాయం జరుగాలంటే జీవితను గెలిపించాలంటూ మెగాబ్రదర్ నాగబాబు పిలుపునిచ్చారు.

మెగా సపోర్టుతో జీవిత, రాజశేఖర్ విజయం
దాంతో శివాజీరాజా ప్యానెల్‌కు ఎదురుగాలి వీచింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కూడా పరోక్షంగా నరేష్ ప్యానెల్‌కు మద్దతు తెలిపారనే ప్రచారం జరిగింది. మెగా బ్రదర్స్ మద్దతుతో శివాజీ రాజా ప్యానెల్ ఓటమిపాలై.. జీవిత, రాజశేఖర్ ఉన్న నరేష్ ప్యానెల్ అనూహ్య విజయం సాధించింది.

మెగా బ్రదర్ నాగబాబుకు ఝలక్ ఇస్తూ
ఇలాంటి నేపథ్యంలో నాగబాబుకు ఝలక్ ఇస్తూ జీవిత, రాజశేఖర్ వైసీపీలో చేరారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు జనసేన తరుఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. వైసీపీలో చేరిన వెంటనే పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రాజశేఖర్ దంపతులు విమర్శలు గుప్పించడం చర్చానీయాంశమైంది.

పవన్ కల్యాణ్‌పై జీవిత ఎటాక్
హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లకు భద్రత కరువు అంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 1) రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి.. పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నాగబాబుకు ఇది గుణపాఠం అని సినీవర్గాల్లో ఓ మాట బలంగా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











