twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరాకు షాక్.. రాంచరణ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.. మా రక్తంతో కోట్లలో బిజినెస్!

    |

    మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్‌పై రూపొందుతున్న సైరా నరసింహరెడ్డి చిత్రం విడుదలకు ముస్తాబుతున్నది. అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా జాతీయ స్థాయి చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్‌లో దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కుటుంబీకులు ధర్నా చేయడంతో ఈ సినిమాను తాజాగా హక్కుల వివాదం చుట్టుముట్టింది. ఆ వివాదం ఏమిటంటే..

    వివాదంలో సైరా హక్కుల అంశం

    వివాదంలో సైరా హక్కుల అంశం

    స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. అయితే ఈ సినిమా కథ విషయంలో తమకు హక్కులు చెందుతాయనే అంశాన్ని ఆయన కుటుంబీకులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో జూన్ 30న ఉయ్యాల‌వాడ కుటుంబ స‌భ్యుల‌కు న్యాయం చేస్తామ‌ని కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ చెప్పి వారికి అగ్రిమెంట్ రాసి ఇచ్చింది అని ప్రముఖ దిన పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

    మీకు హక్కులు లేవని

    మీకు హక్కులు లేవని

    అగ్రిమెంట్ తర్వాత శనివారం (జూన్ 29) రాత్రి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు రాంచరణ్ మేనేజర్ అభిలాష్ ఫోన్ చేసి కథపై మీకు ఎలాంటి హక్కులు లేవు. మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి సముదాయించి పంపారు.

    సంబంధం లేదు వెళ్లిపో అంటూ

    సంబంధం లేదు వెళ్లిపో అంటూ

    సైరా హక్కుల వివాదంపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు స్పందించారు. జూన్ 30న న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు మీకు హక్కు లేదని చెబుతున్నారు. మా భూముల్లోకి వచ్చి ధాన్యాన్ని తొక్కుకుంటూ షూటింగ్ చేశారు. ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపోమ్మని అంటున్నారు. అప్పుడు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించినట్టు సమాచారం. రాంచరణ్ కలుస్తాడని చెప్పి.. ఇప్పుడు లీగల్‌గా హక్కులు లేవు అనడం సమంజసమా అని ప్రశ్నించారు.

    మా రక్తంతో వ్యాపారం చేస్తూ..

    మా రక్తంతో వ్యాపారం చేస్తూ..

    ఉయ్యాలవాడ వంశ రక్తం, మా బంధాలు, అనుబంధాలను బిజినెస్ చేసుకొని కోట్లు గడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మార్చి 11న 22 మంది మా సభ్యులతో చర్చలు జరిపారు. మా కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. రాంచరణ్ మాటకు కట్టుబడి మాకు న్యాయం చేస్తారు అనే నమ్మకం ఉంది. కానీ మధ్యవర్తులే తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    రూ.300 కోట్ల బడ్జెట్‌తో

    రూ.300 కోట్ల బడ్జెట్‌తో

    'సైరా నరిసింహారెడ్డి' చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్నివిడుదల కాబోతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. సైరా చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Infact, Megastar Chiranjeevi's Prestigious project Sye Raa Narasimha Reddy getting ready for Dussera Release. But this movie release may Shift to Sankranti. In complete of VFX works may delay the movie release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X