RRRకు అనుకున్న టైటిల్‌ వేరే సంస్థ సొంతం అయింది.. ఇప్పుడు రాజమౌళి టీమ్ ఏం చేస్తుందో.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందించడం.. ఇందులో టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించడం.. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం వంటి కారణాలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా నుంచి ఎటువంటి పోస్టర్లు గానీ, టీజర్లు గానీ విడుదల కాకున్నా.. హైప్ మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా ఈ సినిమాకు అనుకున్న టైటిల్‌ను ఓ సంస్థ ఎగరేసుకుని పోయింది. ఇంతకీ ఏంటా టైటిల్.? దక్కించుకున్నది ఎవరు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు

ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు

గతంలో తెలుగులో మల్టీస్టారర్ మూవీలు బాగానే వచ్చేవి కానీ, రెండో తరం హీరోలు ఎంటరైన తర్వాత ఇవి అంతగా కనిపించలేదు. వాస్తవానికి కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్లు బాగా వస్తున్నాయి. అయితే, వాటిలో స్టార్ హీరోలు నటించినవి కొన్నే ఉన్నాయి. ఇప్పుడు RRRలో చరణ్, తారక్ నటించడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది.

 అసలైంది మాత్రమే మిగిలింది

అసలైంది మాత్రమే మిగిలింది

RRR షూటింగ్ ప్రారంభమై ఏడాది కూడా గడిచిపోయింది. కానీ, సినిమాకు సంబంధించిన షూటింగ్ మాత్రం డెబ్బై శాతమే పూర్తయింది. దీనికి కారణం ఇందులో నటిస్తున్న వారు గాయపడడం.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వంటివి అని చెప్పొచ్చు. మిగిలిన ముప్పై శాతం షూటింగ్‌లో క్లైమాక్స్ సహా ప్రధానమైన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ షెడ్యూలే జరుగుతోంది.

సినిమా వాయిదా పడినట్లే

సినిమా వాయిదా పడినట్లే

కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేకపోవడమే అని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఈ మూవీని మొత్తంగా పది భాషల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని కూడా అంటున్నారు. ఇదే జరిగితే సినిమా లేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

 రాజమౌళి ప్రకటనతో పోటెత్తాయి

రాజమౌళి ప్రకటనతో పోటెత్తాయి

‘RRR' అనేది ఈ సినిమా అసలు టైటిల్ కాదని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, రాజమౌళి కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఇదే ఒరిజినల్ టైటిల్ అని అనౌన్స్ చేశారు. అంతేకాదు, దీనికి భాషను బట్టి క్యాప్షన్ పెడతామని అన్నారు. ఇందుకోసం ఫ్యాన్స్ మంచి టైటిల్ తమకు పంపాలని కోరారు. దీంతో ఎంతో మంది తమ ఆలోచనలతో కూడిన టైటిల్స్ వాళ్లకు సెండ్ చేశారు.

 కొన్నింటికి ఫిదా అయిపోయారు

కొన్నింటికి ఫిదా అయిపోయారు

‘RRR'ను ట్యాగ్ చేస్తూ చిత్ర యూనిట్‌కు ఎంతో మంది టైటిల్స్‌ను పంపారు. వాటిలో చాలా వరకు మంచిగానే ఉన్నాయి. ఈ విషయాన్ని ‘RRR' టీమ్ కూడా ట్వీట్ చేసింది. ఆ సమయంలో ‘రామ రావణ రాజ్యం', ‘రఘుపతి రాఘవ రాజారాం', ‘రాజ్యం రణం రక్తం', ‘రణం రౌద్రం రాజసం' సహా మరొకొన్ని టైటిళ్లకు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

అనుకున్న టైటిల్ పోయింది

అనుకున్న టైటిల్ పోయింది

ప్రేక్షకులు పంపిన వాటిలో ఈ సినిమాకు ‘రామ రావణ రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వి3 ఫిలింస్‌ అనే సంస్థ ఈ టైటిల్‌ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకుంది. ఈ టైటిల్‌కు వస్తున్న స్పందన వల్లే ఆ సంస్థ టైటిల్ రిజిస్టర్ చేయించిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X