»   » ‘బాహుబలి’ టీంకు షాక్: ట్రైలర్ తొలగించిన యూట్యూబ్

‘బాహుబలి’ టీంకు షాక్: ట్రైలర్ తొలగించిన యూట్యూబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి చిత్ర యూనిట్ సభ్యులకు ‘యూట్యూబ్' నుండి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల 2 నిమిషాల నిడివిగల ‘బాహుబలి-ది బిగినింగ్' తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఎవరూ ఊహించని విధంగా తక్కువ కాలంలోనే ఈ ట్రైలర్ 20 లక్షల హిట్స్ సొంతం చేసుకుంది. అయితే ఉన్నట్టుండి యూట్యూబ్ ఈ వీడియోను తొలగించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఈ వీడియో ఉండటం వల్లనే ఈ ట్రైలర్ తొలగించినట్లు యూట్యూబ్ పేర్కొంది.

స్పామ్, స్కామ్స్, కమర్షియల్లీ డిసెప్టివ్ కంటెంటుకు వ్యతిరేకంగా ఉన్న యూట్యూబ్ పాలసీకి భంగం కలిగించేలా ఈ వీడియో ఉందని యూట్యూబ్ సంస్థ పేర్కొంది. ఈ ట్రైలర్ తొలగించడంతో బాహుబలి చిత్ర అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గతంలో మహేష్ బాబు సినిమా ‘1-నేనొక్కడినే' ట్రైలర్ విషయంలో కూడా ఇలానే జరిగింది. అప్పట్లో కూడా ఆ ట్రైలర్ యూట్యూబ్ నుండి తొలగించారు.


Shock: YouTube removes Baahubali Trailer

మరి తాజాగా పరిణామాలపై రాజమౌళి అండ్ టీం ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. యూట్యూబ్ వారితో సంప్రదింపులు జరిపి త్వరలోనే మళ్లీ ట్రైలర్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.


ఇటీవల విడుదలైన ట్రైలర్లో కీరవాణి నేపధ్యసంగీతం, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన గ్రాఫిక్స్, ప్రభాస్ రాజసం, రానా లుక్స్, వార్ ఎపిసోడ్స్, వాటర్ ఫాల్ షాట్స్ ట్రైలర్ కి హై లైట్ గా నిలిచాయి. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. హిందీలో ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, ఎ.ఎ.ఫిల్మ్స్‌ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం సోమవారం కొన్ని థియేటర్లతో విడుదల చేసారు కూడా.

English summary
YouTube removes Baahubali Trailer. This video has been removed as a violation of YouTube's policy against spam, scams and commercially deceptive content.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu