జియా ఖాన్ మరణంతో...బాలుడి ఆత్మహత్య
జైపూర్ : బాలీవుడ్ నటి జియా ఖాన్ ఇటీవల ముంబైలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మరణాన్ని తట్టుకోలేక 12 ఏళ్ల బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జియా ఖాన్ మరణం వల్ల బాలుడు అప్ సెట్ అయ్యాడని, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆత్మహత్యకు పాల్పడ్డ బాబు అనే బాలుడు శ్రీగంగానగర్ జిల్లాలోని గురునానక్ బస్తీకి చెందిన వాడని, 5వ తరగతి చదువుతున్నాడని, జూన్ 4వ తేదీన తన ఇంట్లో సీలింగ్ కొక్కేనికి తాడు కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాకేష్ కుమార్ పిటిఐ వార్తా సంస్థకు బుధవారం వెల్లడించారు.
బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం...జియా ఖాన్ సూసైడ్ ఎపిసోడ్‌ను బాలుడు టీవీల్లో వీక్షించాడని, చాలా అప్ సెట్ అయ్యాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలిపారు. పోస్టు మార్టమ్ తర్వాత బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.


Click it and Unblock the Notifications












