డిప్యూటీ సీఎం సాబ్‌తో రాజమౌళి.. పవన్ కల్యాణ్‌తో జక్కన్న చర్చలు.. ఫోటో వైరల్

అసలు ఇండియన్ సినిమా దగ్గర కొన్ని క్రేజీ కాంబినేషన్ లు ఊహించుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మరి అలాంటి ఒక సెన్సేషనల్ కాంబినేషన్ లలో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ ఒకటి అని చెప్పాలి. పవన్ పీక్ క్రేజ్ కి రాజమౌళి లాంటి పక్కా కమర్షియల్ దర్శకుడు సినిమా పడితే బాక్సాఫీస్ ఊచకోత ఊహించని లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పడాలి అని ఎప్పుడు నుంచో అభిమానులు అనుకుంటున్నారు కానీ ఇది అందని ద్రాక్ష లానే మిగిలిపోయింది. కాగా ఒకప్పుడు రాజమౌళి పవన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించాను కానీ కుదరలేదు అని కూడా చెప్పుకొచ్చాడు. పైగా రాజమౌళి తండ్రి గ్లోబల్ సెన్సేషనల్ ఆర్ ఆర్ ఆర్ సృష్టికర్త పవన్ ఇమేజ్ ని మ్యాచ్ చేసే కథని నేను రాసుకోలేనని అంత అపారమైన క్రేజ్ పవన్ సొంతం అని తాను చెప్పుకొచ్చారు.

shocker rajamouli meets pawan kalyan on this reason

అంతే కాకుండా తన మరో ఎపిక్ బాహుబలి 2 లో ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ప్రేరణ కూడా పవన్ కళ్యాణే అని విజయేంద్ర ప్రసాద్ సెలవిచ్చారు. మరి వీరి కలయికలో సినిమా చేయకుండానే ఓ రేంజ్ ఎలివేషన్ లు అంచనాలు పడ్డాయి, నెలకొన్నాయి. కానీ తాజాగా రాజమౌళి డెప్యూటీ సీఎం సాబ్ ని కలవడం అనే ఒక విజువల్ క్రేజీ థింగ్ గా మారిపోయింది.

పవన్ మరియు రాజమౌళి పై ఓ పిక్ ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకొని చేతితో చేయి పట్టుకొని నవ్వుతు మాట్లాడుతున్న దృశ్యాలు కొన్ని బయటకి వచ్చాయి. అయితే ఇది అంతా చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ ఇది సినిమా కోసం అయితే కాదు. ఇటీవల కాలం చేసిన ప్రముఖులు రామోజీరావు స్మరణ సభకి వీరు అథిధులుగా రాగా అక్కడ ఒకరినొకరు కలుసుకొని పలకరించుకున్నారు.

అలా ఈ ఊహించని కలయిక సాధ్యపడింది. మరి సినిమా లాంటివి ఏమన్నా ఉన్నాయో లేదో కాలమే నిర్ణయించాలి. ఇక రాజమౌళి అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సెన్సేషనల్ సినిమా చేస్తున్నారు. ఇది గ్లోబల్ లెవెల్లో ఉండనుండగా అతి త్వరలోనే ఇది మొదలు కాబోతుంది. అలాగే ఇది మహేష్ బాబు కెరీర్ 29వ సినిమాగా తెరకెక్కుతుంది.

shocker rajamouli meets pawan kalyan on this reason

ఇక పవన్ విషయానికి వస్తే తాను మూడు భారీ సినిమాలు చేస్తున్నాడు. ఒకటి సుజీత్ దర్శకత్వంలో "ఓజి" చేస్తుండగా మరొకటి క్రిష్, జ్యోతి కృష్ణ ల దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" చేస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు కాగా ఈ సినిమాలుతో పాటుగా దర్శకుడు హరీష్ శంకర్ తో పక్కా మాస్ ఎంటర్టైనర్ "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాని తాను చేస్తున్నాడు. ఈ మూడు చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. కానీ ఇంకా మొత్తం షూట్ పూర్తి కావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: rajamouli pawan kalyan ramojirao
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X