twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: కబళించిన కరోనా.. ప్రముఖ నటుడు మృతి

    |

    దేశవిదేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా మహమ్మారి ఓ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ మృతి చెందారు. వివరాల్లోకి పోతే..

    కరోనా కల్లోలం.. వేలల్లో మరణాలు

    కరోనా కల్లోలం.. వేలల్లో మరణాలు

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. చైనా దేశంలో పుట్టి ఇప్పటికే 202 దేశాలకు విస్తరించిన ఈ వైరస్ 42 వేల మందిని బలి తీసుకోవడంతో అంతా వణికిపోతున్నారు. ఈ కరోనా బారిన పడిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

    ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ మృతి

    ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ మృతి

    తాజాగా ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ కరోనా పాజిటివ్ తో లండన్‌లో చనిపోయారని తెలిసింది. అతను సర్రే ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారని అతని మేనేజర్ జిల్ మెక్ కల్లౌ మీడియాకు తెలిపారు. స్టార్ వార్ యాక్టర్‌గా ఆండ్రూ జాక్ ప్రజాధారణ పొందారు.

    ఆండ్రూ జాక్‌ భార్య రియాక్షన్

    ఆండ్రూ జాక్‌ భార్య రియాక్షన్

    ఆండ్రూ జాక్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు రెండురోజుల క్రితం నిర్దారణ అయ్యిందని ఆయన భార్య గ్యాబ్రియెల్ రోజర్స్ తెలిపారు. వైరస్ సోకిందనే బాధ అతనిలో కనిపించలేదని ఆమె అన్నారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అతని జ్ఞాపకాలతో తాము ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్నారు.

    Recommended Video

    Prabhas - The Charity King In Tollywood | Filmibeat Telugu
    కరోనా దాడి.. సినీ పరిశ్రమ విలవిల

    కరోనా దాడి.. సినీ పరిశ్రమ విలవిల

    ఇప్పటికే అమెరికన్ సింగర్ జో డిఫీ (61) కరోనా సోకి మరణించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రిందటే హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌ కరోనా బారినపడి మరణించారు. దీంతో హాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమలు కరోనా భయంలో విలవిలలాడుతున్నాయి.

    English summary
    Actor Andru Jack was passes away following coronavirus complications. He is famous with Star War.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X