Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షాకింగ్: కబళించిన కరోనా.. ప్రముఖ నటుడు మృతి
దేశవిదేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా మహమ్మారి ఓ నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ మృతి చెందారు. వివరాల్లోకి పోతే..
కరోనా కల్లోలం.. వేలల్లో మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. చైనా దేశంలో పుట్టి ఇప్పటికే 202 దేశాలకు విస్తరించిన ఈ వైరస్ 42 వేల మందిని బలి తీసుకోవడంతో అంతా వణికిపోతున్నారు. ఈ కరోనా బారిన పడిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ మృతి
తాజాగా ప్రముఖ నటుడు, స్టార్ వార్ యాక్టర్ ఆండ్రూ జాక్ కరోనా పాజిటివ్ తో లండన్‌లో చనిపోయారని తెలిసింది. అతను సర్రే ఆస్పత్రిలో మంగళవారం మృతిచెందారని అతని మేనేజర్ జిల్ మెక్ కల్లౌ మీడియాకు తెలిపారు. స్టార్ వార్ యాక్టర్‌గా ఆండ్రూ జాక్ ప్రజాధారణ పొందారు.
ఆండ్రూ జాక్ భార్య రియాక్షన్
ఆండ్రూ జాక్‌కు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు రెండురోజుల క్రితం నిర్దారణ అయ్యిందని ఆయన భార్య గ్యాబ్రియెల్ రోజర్స్ తెలిపారు. వైరస్ సోకిందనే బాధ అతనిలో కనిపించలేదని ఆమె అన్నారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అతని జ్ఞాపకాలతో తాము ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో క్వారంటైన్లో ఉన్నారు.
Recommended Video
కరోనా దాడి.. సినీ పరిశ్రమ విలవిల
ఇప్పటికే అమెరికన్ సింగర్ జో డిఫీ (61) కరోనా సోకి మరణించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రిందటే హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనా బారినపడి మరణించారు. దీంతో హాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమలు కరోనా భయంలో విలవిలలాడుతున్నాయి.