»   » షాకింగ్: పరిస్దితి బాగోక, నటి ముష్టెత్తుతూ, దొంగతనం చేస్తూ దొరికిపోయింది

షాకింగ్: పరిస్దితి బాగోక, నటి ముష్టెత్తుతూ, దొంగతనం చేస్తూ దొరికిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రత్యూష బెనర్జీ సూసైడ్ కేసు మన మనోఫలకం నుంచి తొలగక ముందే, ఇంకో ట్రాజడీ స్టోరీ బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన ఆర్టిస్టు దొంగతనం చేస్తూ, ముష్టి ఎత్తుకుంటూ కనపడటం అందరికీ భాధాకరమే.

గీతాంజలి నాగపాల్ ని గుర్తు చేసే విధంగా సాగిన ఈ కథ మీకు భాధ కలిగిస్తుంది. ముంబై కు చెందిన పోలీసులు లోకండ్ వాలా రోడ్డుపై ముష్టి ఎత్తుతూ కనపడింది. ఆమె మరెవరో కాదు.. డిల్లీ కి చెందిన మిటాలి శర్మ.

25 సంవత్సరాల ఆమె తన ఇంట్లో నుంచి పారిపోయి... సినిమాల్లో సెటిల్ అవుతానని వచ్చేసింది. దాంతో ఆమె తల్లి తండ్రులు ఆమెను పూర్తిగా వదిలేసారు. ఆమె లోకండ్ వాలా హౌసింగ్ సొసైటీ వద్ద...ఓ కారు అద్దం పగలకొట్టి, కారు లోపల ఉన్నవి దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తున్న ఆమెను పోలీసులు పట్టుకున్నారు.

 Shocking: Actress found begging and stealing on Mumbai roads

తనని పట్టుకోవటానికి వచ్చిన ఇద్దరు లేడీ పోలీస్ ఆఫీసర్ ని ఆమె నెట్టివేసి పారిపోబోయింది. అయితే ఆ ఇద్దరిలో ఒకామె గట్టిగా పట్టుకోవటంతో దొరికిపోయింది. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి ప్రశ్నిస్తూంటే...ఆమె భోజపురి చిత్రంలో నటించిన విషయం బయిటకు వచ్చింది. అంతేకాకుండా కొన్ని మోడలింగ్ ఎసైన్మెంట్స్ పూర్తి చేయటం కూడా చెప్పుకొచ్చింది. ఆమె కెరీర్ లో పూర్తిగా వెనకపడటంతో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

ఆ పోలీసులు ఆమెను తల్లి తండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె చింపిరి జుట్టుతో,చిరిగిన బట్టలతో ఉండటం, ఆమె గురించి చేసిన ఎంక్వైరీలో పోలీసులకు తెలిసిన విషయం..ఆమె చాలా కాలంగా ముష్టి ఎత్తుతూ బ్రతుకుతోందని. అలాగే ముష్టి దొరకని సమయంలో చిన్న చిన్న దొంగతనాలు చేసి కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తోందని.

ఆమె తమకు దొరికేటప్పుటికి గత రెండు రోజులుగా ఆమె ఏమీ తినలేదని, తనకు ఏమైన తినటానికి పెట్టమని కోరిందని వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఆమెను ప్రస్తుతం ధానెలోనే మానసిక వైద్యశాలలో చేరుస్తున్నామని అన్నారు.

సీనియర్ ఇన్సిపెక్టర్ శుభాష్ మాట్లాడుతూ... ఆమె ప్రస్తుతం నార్మల్ గానే ఉంది. ఆమె ఫ్యామిలి ఎక్కడుందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మానసివ వైద్యశాల డాక్టర్ అంజలి దేశపాండే మాట్లాడుతూ...ఆమె పది రోజులు విశ్రాంతి తీసుకుంటే నార్మల్ స్టేట్ కి వస్తుందని అన్నారు. ఆమెకు మానసిక వైద్యం కాదు ఆరోగ్యం మెరుగు అవటానికి మెడికల్ అసిస్టెంట్స్ కావాలి అని చెప్పుకొచ్చారామె.

English summary
Almost a déjà vu of the famous Gitanjali Nagpal story, Oshiwara police have found an actress begging and stealing on the roads of Lokhandwala, Mumbai.As per an article in a national tabloid, resident of Delhi, 25 years old Mitali Sharma, took to stealing after her career stalled and her parents abandoned her for pursuing her dreams of becoming an actor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu