అనుష్క ఆన్‌స్క్రీన్ భర్తపై కేసు: మైండ్ గేమ్‌తో టార్చర్ పెట్టాడంటున్న భార్య..

Recommended Video

అనుష్క ఆన్‌స్క్రీన్ భర్త అరెస్ట్, సైకో, గే, రాత్రుళ్లు చాటింగ్

టాలీవుడ్‌ యువ హీరో సామ్రాట్‌ రెడ్డిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. సామ్రాట్‌ రెడ్డి భార్య హర్షితా రెడ్డే ఆయనపై కేసు పెట్టడం గమనార్హం. గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్న సామ్రాట్‌పై.. ఇప్పటికే గృహహింస, వరకట్న వేధింపుల కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

 ఏంటీ కేసు:

ఏంటీ కేసు:

మాదాపూర్‌లోని తన నివాసంలో సామ్రాట్‌ దొంగతనానికి పాల్పడ్డాడని అతని భార్య హర్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో సామ్రాట్‌ లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులు, ఆభరణాలు దోచుకెళ్లాడని ఆరోపించారు.

సీసీటివి ధ్వంసం:

సీసీటివి ధ్వంసం:

చోరీ సమయంలో సీసీటివి కెమెరాలను ధ్వంసం చేసి.. దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డ్ కాకుండా జాగ్రత్తపడ్డాడని హర్షితా రెడ్డి పోలీసులకు తెలిపారు. సోమవారం రాత్రి ఆమె మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

 పోలీసుల అదుపులో:

పోలీసుల అదుపులో:

హర్షితా రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు.. నిందితుడు సామ్రాట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 విడిగా ఉంటున్న సామ్రాట్-హర్షితా:

విడిగా ఉంటున్న సామ్రాట్-హర్షితా:

గత కొంతకాలంగా హర్షితా రెడ్డి-సామ్రాట్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తుతూ వస్తున్నాయి. రెండేళ్ల క్రితం వీరి పెళ్లి కాగా.. ఆ తర్వాత కొన్నాళ్ల నుంచే ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గతంలో సామ్రాట్‌పై రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 498/ఏ చట్టం కింద కేసు నమోదయింది.

 మైండ్ గేమ్‌తో టార్చర్ పెట్టారు: హర్షితా రెడ్డి

మైండ్ గేమ్‌తో టార్చర్ పెట్టారు: హర్షితా రెడ్డి

'ఇన్నాళ్లు మౌనంగా భరిస్తూ వచ్చాను. కానీ అతను చేసే తప్పులకు నేనెందుకు బాధపడాలి. మైండ్ గేమ్‌తో టార్చర్ పెట్టారు. బయటకు ఒక లాగా కనిపిస్తారు.. లోపల మరోలా ఉంటారు. వాళ్ల తల్లిదండ్రులతో చెప్పితే.. భరించాలని నన్నే బెదిరించేవారు.' అని హర్షితా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

'నా పక్కనే ఉండి వేరే అమ్మాయిలతో..'

'నా పక్కనే ఉండి వేరే అమ్మాయిలతో..'

'వాళ్ల వేధింపులకు నేను డిప్రెషన్ లోకి వెళ్లాను. తిరుగుబోతుగా ఉన్న భరించాను. చిన్న విషయానికే కొడుతుండేవాడు. నాకు నచ్చని ప్రదేశాలకు కూడా తీసుకెళ్లి ఇబ్బందిపెట్టాడు. నన్ను తన లైఫ్ నుంచి తప్పించాలనుకున్నాడు. నా పక్కనే ఉండి వేరే అమ్మాయిలతో చాట్ చేస్తుండేవాడు.' అని హర్షితా రెడ్డి పేర్కొన్నారు.

 సంబంధం వద్దనుకున్నాం:

సంబంధం వద్దనుకున్నాం:

'నిజానికి ఈ సంబంధం వద్దనే అనుకున్నాం. సినిమా వ్యక్తితో పెళ్లి నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ వాళ్లే మా ఫ్యామిలీ వెంటపడ్డారు. మూడు,నాలుగుసార్లు మా ఇంటికొచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సినిమాలు చేయడం లేదని బిజినెస్ చేస్తున్నాడని చెప్పి పెళ్లికి ఒప్పించారు.' అని హర్షితా వాపోయారు.

 'పంచాక్షరి'లో అనుష్క భర్తగా:

'పంచాక్షరి'లో అనుష్క భర్తగా:

సామ్రాట్‌రెడ్డి.. ప్రముఖ మోడల్‌ శిల్పారెడ్డి సోదరుడన్న సంగతి తెలిసిందే. 'పంచాక్షరి'లో అనుష్క భర్తగా నటించిన సామ్రాట్‌.. తకిట తకిట, బావా, దేనికైనా రెడీ లాంటి సినిమాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X