»   » ‘బాహుబలి': ఈ హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ/ కాపీ

‘బాహుబలి': ఈ హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ/ కాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘బాహుబలి' సినిమా శుక్రవారం విడుదలైంది. ఇక థియేటర్లలతో హీరో ప్రభాస్‌ అభిమానులే సందడే కనిపించింది. డప్పు దరువులు.. యువకుల నృత్యాలు.. అభిమాన హీరో ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం, పూలాభిషేకాలతో నగరంలోని సినిమా థియేటర్ల వద్ద కోలహాలం నెలకింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


టికెట్ల కోసం బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఎగబడ్డారు. గేట్లు దూకి మరీ టికెట్ల కోసం పరుగులు తీశారు. చాలా చోట్ల మల్టీప్లెక్స్‌లో సైతం ఉదయం ఏడు గంటలకు అభిమానుల కోసం ప్రత్యేక ఆటను ప్రదర్శించారు. టాకీస్‌ల వద్ద ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.యువతీ యువకులు థియేటర్లలో సెల్ఫీలు దిగుతూ హంగామా చేశారు. ఇవి ఇలా ఉంటే...ఈ సినిమా కు రివ్యూలు మిక్సెడ్ గా వచ్చాయి.


రాజమౌళి క్వాలిటీ ప్రొడక్ట్ ని అందించినా ఎమోషన్ కంటెంట్ మిస్సైందని టాక్ వచ్చింది. అంతేకాదు ఎప్పటిలాగే ఈ చిత్రంలో సన్నివేశాలు...షాట్స్ హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్నారనే విమర్శలు సైతం భారీగానే వినపడ్డాయి.


SHOCKING: Baahubali Copied/Inspired From These Hollywood Films

ముఖ్యంగా సినిమాలో హైలెట్ గా నిలిచిన త్రిశూల యుద్దం స్టాటజీ ని అలెగ్జాండర్ చిత్రం నుంచి రిప్ ఆఫ్ చేసారని చెప్పుకుంటున్నారు. అలాగే...Redcliff, Confucius నుంచి వార్ ఎపిసోడ్స్ తీసుకున్నారని, ట్రాయ్, 300 నుంచి షాట్స్ అవీ తీసుకున్నారని అంటున్నారు. అయితే గతంలోనూ రాజమౌళి సినిమాలకు ఈ విధమైన విమర్శలు వచ్చాయి.


మరో ప్రక్క


తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్థాయిలో హాలీవుడ్ రేంజి సినిమా తీసిన దర్శకుడు రాజమౌళికి అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళి అండ్ టీం తమ సినిమా సాధిస్తున్న ఫలితాలు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు నుండి అందుతున్న ప్రశంసలతో దాదాపు మూడేళ్లుగా పడ్డ కష్టాన్ని మరిచిపోతున్నారు.


‘బాహుబలి' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తా చాటుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా సత్తా చాటింది.


ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' పికె రికార్డును బద్దలు కొట్టింది.


‘బాహుబలి' సినిమా అమెరికా బాక్సాపీసు వద్ద తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే మున్ముందు ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Baahubali surprisingly opened up to mixed reviews all over the world. Apparently, few intellectuals were quick enough to point out copied scenes in Baahubali, which were heavily inspired from some Hollywood flicks.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu