పబ్బులో ఘర్షణ.. రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. తీవ్ర గాయాలు కావడంతో!!

బిగ్‌బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ ఓ వైపు తన కెరీర్ పట్ల శ్రద్ద తీసుకుంటూనే మరోవైపు ఎంజాయ్ చేస్తుంటాడనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత రాత్రి సరదా పబ్బుకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరగడంతో అంతా షాకవుతున్నారు. ఇంతకీ రాహుల్ సిప్లిగంజ్‌పై ఆ దాడి చేసిందెవరు? ఈ పరిణామానికి కారణాలేంటి? వివరాల్లోకి పోతే..

Recommended Video

Rahul Sipligunj Involved In A Brawl | పబ్బులో ఘర్షణ..!!
బిగ్‌బాస్ షో.. రాహుల్ ఫేమస్

బిగ్‌బాస్ షో.. రాహుల్ ఫేమస్


ప్లే బ్యాక్ సింగర్‌గా అతికొద్ది మందికే తెలిసిన రాహుల్.. బిగ్‌బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడయ్యాడు. బిగ్‌బాస్ విజేతగా నిలవడమే కాకుండా నిజాయితీగా ఉండి, ఆడి ఎంతో మంది హృదయాలను గెలిచాడు. దీంతో రాహుల్ పాపులారిటీ అమాంతం పెరిగింది.

స్నేహితులతో సరదా షికార్లు

స్నేహితులతో సరదా షికార్లు

సాధారణం గానే ఎప్పుడూ స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు చేస్తూ ఎంజాయ్ చేసే అలవాటున్న రాహుల్.. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తెగ పార్టీలు చేసుకుంటున్నాడు. గతంలో మిస్ అయిన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

మహిళా స్నేహితురాలితో.. పబ్‌లో యువకులు

మహిళా స్నేహితురాలితో.. పబ్‌లో యువకులు

గత (బుధవారం) రాత్రి కూడా కొందరు స్నేహితులు, మహిళా స్నేహితురాలితో కలిసి సరదా ఎంజాయ్ చేసేందుకు గాను గచ్చిబౌలి లోని ఓ పబ్‌కి వెళ్ళాడు రాహుల్. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో మాటామాటా పెరిగి పెద్దదైంది.

రాత్రి 11:45 గంటల ప్రాంతంలో..

రాత్రి 11:45 గంటల ప్రాంతంలో..

ఈ వివాదం మరింత ముదరడంతో ఇరువురు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో సదరు యువకులు బీరు సీసాలతో రాహుల్‌పై దాడికి దిగారు. ఈ క్రమంలో రాహుల్ తలపై బాదారు. దీంతో రాహుల్‌కి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన రాత్రి 11:45 గంటల ప్రాంతంలో జరిగింది.

ఆసుపత్రిలో రాహుల్.. పోలీసుల దర్యాప్తు

ఆసుపత్రిలో రాహుల్.. పోలీసుల దర్యాప్తు


తీవ్రంగా గాయపడిన రాహుల్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి పబ్‌లోని సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X