twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రాలు : స్టార్స్ షాకింగ్ మరణాలు, చిన్నవయసులోనే!

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ సినీ పరిశ్రమ ఎంతో మంది యువ కెరాటాలను రా..రమ్మని తన వైపు ఆకర్షించుకుంటూ ఉంటుంది. ఈ రంగుల గ్లామర్ ప్రపంచానికి ఎప్పటి కప్పుడు యవ్వన రక్తం ఎక్కితేనే కలర్ ఫుల్‌గా కళకళలాడుతూ ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సింది కూడా అదే. అయితే కొన్ని సందర్భాల్లో యువతారలు జీవితంలో అనుకోని సంఘటనల కారణంగా అనంత లోకాలకు వెలుతూ సినీ ప్రేమికులను షాక్‌కు గురి చేస్తున్నారు.

    తాజాగా బాలీవుడ్ నటి జియా ఖాన్ మరణమే అందుకు నిదర్శనం. గతంలో చాలా మంది తారలు జియా ఖాన్ తరహాలో బలవన్మరణానికి పాల్పడగా, మరికొందరు విధిరాసిన రాతలో ప్రమాదాలకు గురై అసువులు బాసారు. ఏది ఏమైనా తమను ఆట పాటలతో, గ్లామర్ సొగబులతో అలరించిన వారు హఠాన్మరణం పొందడం అభిమానులను బాధించే అంశమే.

    జియా ఖాన్ తరహాలోనే గతంలో పలువురు తారలు చిన్న వయసులో ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పాత తరం నటి ఫర్వీన్ బాబి, నిన్నటి తరం నటి దివ్య భారతి, స్మితా పాటిల్, గురు దత్, సంజీవ్ కుమార్, పాతతరం నటి మధుబాల ఇలా ఎందరో అర్దాంతరంగా తనువు చాలించిన వారే.

    జియా ఖాన్ (1988-2013)

    నటి జియా ఖాన్ సోమవారం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలీవుడ్లో కెరీర్ నిరాశ జనకంగా ఉండటం, ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ నిశ్శబ్ద్ సినిమా ద్వారా జియా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

    దివ్య భారతి (1974-1993)

    తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి....పిన్న వయసులోనే మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే.

    స్మితా పాటిల్(1955-1986)

    బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి స్మితా పాటిల్....ప్రసవ సమయంలో వచ్చిన సమస్యలతో మరణించారు.

    ఫర్వీన్ బాబి(1949-2005)

    1970, 80ల్లో బాలీవుడ్‌ను తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన ఫర్వీన్ బాబి జుహు‌లోని తన నివాసంలో మరణించారు. ఆమె మరణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు.

    మధుబాల (1933-1969)

    బాలీవుడ్ చరిత్రలోని గొప్ప నటీమణుల్లో మధుబాల ఒకరు. గుండె సంబంధ సమస్యలతో ఆమె యంగ్ ఏజ్‌లోనే మరణించారు.

    గురుదత్ (1925-1964)

    బాలీవుడ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు గురుదత్ 1964 అక్టోబర్ 10న మరణించారు. ముంబైలోని పెద్దార్ రోడ్ లోని తన రెంటెడ్ హౌస్ లో ఆయన మరణించిన కనిపించారు. స్లీపింగ్ పిల్స్, మధ్య కారణంగా ఆయన మరణించారు. ఆయన మరణం సూసైడ్ అని కొందరు. అనుకోకుండా ఓవర్ డోస్ అయిన మరణించారని కొందరి వాదన.

    ప్రియా రజ్వాన్ష్(1937-2000)

    నటి ప్రియా రజ్వాన్స్-చేతన ఆనంద్ మధ్య పర్సనల్ రిలేషన్ షిప్ ఉండేది. వీరు కలిసి జీవించే వారు. మార్చి 27, 2000న ముంబై జుహులోని చేతన్ ఆనంద్ బంగ్లాలో ఆమె హత్య జరిగింది. పోలీసులు చేతన్ ఆనంద్ కుమారులపై కేసు నమోదు చేసారు.

    నిర్మల పాండే (1962-2010)


    బాలీవుడ్ నటుడు నిర్మల్ పాండే 48 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో మరణించారు.

    మీనా కుమారి (1932-1972)


    పాత తరం నటి మీనా కుమారి మార్చి 31, 1972లో అనారోగ్యంతో మరణించారు. ఆమె నటించిన పాకీజా చిత్రం విడుదలైన మూడు వారాలకు ఆమె కన్ను మూసింది.

    గీతా బాలి (1930-1965)


    గీతా బాలి 1965 జనవరి 21న మరణించింది. పంజాబీ మూవీ ‘రానో' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న ఆమెకు మశూచి వ్యాది సోకి మరణించింది.

    తరుణి సచ్ దేవ్ (1998-2012)


    బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణి సచ్ దేవ్ రస్నా యాడ్‌తో బాగా పాపులర్ అయింది. అతి చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో మరణించింది.

    English summary
    Bollywood industry has time and again welcomed and cherished several young talents who have reigned the tinselville and earned immense fame. But, the industry has also witnessed those sad days, when a few of the industry's most promising faces met the inevitable reality of life which is the death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X