Jr NTR అభిమాని మృతి కేసులో ట్విస్టు.. ముమ్మాటికి హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
కోనసీమకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ మృతి పై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఊహించని విధంగా కుటుంబ సభ్యులు కూడా వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికే శ్యామ్ డెత్ పై చాలామంది నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి.. వెంటనే కేసు నమోదు చేసి నిజా నిజాలు బయటకు వెల్లడించాలి అని డిమాండ్ చేస్తున్నారు.
ఇక శ్యామ్ కుటుంబ సభ్యులకు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆత్మహత్య కాదు అని అతని ఒంటిపై గాయాలు ఉన్నాయి అని చెబుతున్నారు. మా కుమారుడికి ఇలా జరిగింది అని ఫోన్ ఫోన్ అయితే వచ్చింది. ఇంకా వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక మళ్లీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఆ విషయం తప్పించి నాకు ఏమీ తెలియదు అని శ్యామ్ తల్లి మాట్లాడారు. ఇక శ్యామ్ తండ్రి మాట్లాడుతూ.. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు గానీ జనాలు అయితే మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు.

అలాగే శ్యామ్ కు కూడా కొన్ని గాయాలు అయ్యాయి. సూదితో గుచ్చినట్లు మరికొన్ని గాయాలు ఉన్నాయి. ఒక చెయ్యి అయితే కోసేసి ఉంది. అది కూడా నేను చూశాను. ఇక పోలీసులు వచ్చాక ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. మా మేనల్లుడు వెళ్లి కొన్ని ఫోటోలు తీశాడు.. అని శ్యామ్ శతండ్రి మీడియాకు వివరణ ఇచ్చారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే శ్యామ్ చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కొన్ని సినిమా ఈవెంట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఇక అతనికి సంబంధించిన ఫోటోలు కూడా చాలాసార్లు వైరల్ అయ్యాయి. అయితే మణికంఠ ఈ నెల 25న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఒక్కసారిగా వార్తలు వచ్చాయి.
అయితే అతను ఉరివేసుకున్న చోటే రక్తపు మరకలు ఎక్కువగా ఉండడం అందరికీ అనుమానాలను రేకెత్తించింది. శ్యామ్ శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయి. అలాగే అతని ఎడమ చేతికి బ్లేడ్తో పోసిన గాయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముక్కు చెవిలో నుంచి కూడా రక్తం కారినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఆత్మహత్య కాదు, హత్య అంటూ చెబుతున్నారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు చాలామంది కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ దీని వెనుక ఎవరో ఉన్నారు అని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేస్తుంది అని ప్రభుత్వాధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలి అని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











