twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం పీకలేరు బ్రదర్.. ముదురుతున్న 'మెగా vs అల్లు అర్జున్' ఫ్యాన్స్ గొడవ..?

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో మరొకసారి అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు ముదురుతున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా లోనే కాకుండా ఇప్పుడు అభిమాన సంఘాల మీటింగ్స్ లో కూడా ఊహించని విధంగా మాటల యుద్ధం నెలకొన్నట్లు తెలుస్తోంది. మెగా వర్సెస్ అల్లు అర్జున్ కు సంబంధించిన అనేక రకాల గొడవల పై సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మిగతా అభిమానుల నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కొన్ని నెగిటివ్ ట్యాగ్స్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ గొడవ కు కారణాలు ఏంటి? ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

    మాటల యుద్ధం

    మాటల యుద్ధం

    ఒకప్పుడు కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోని అభిమానుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ వాతావరణం తెలుగు ప్రాంతాలను కూడా తాకింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య లో ఊహించని విధంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన నెగిటివ్ ట్యాగ్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.

    'ఏం పీకలేరు బ్రదర్'

    'ఏం పీకలేరు బ్రదర్'


    ముఖ్యంగా 'ఏం పీకలేరు బ్రదర్' అని ట్యాగ్ అయితే గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అనే మాటను ఏ విధంగా హైలెట్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అప్పటినుంచి ఈ లైన్ అయితే నెగిటివ్ విషయాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఇప్పుడు అభిమానుల మధ్యలో కూడా 'ఏం పీకలేరు బ్రదర్' అనే ట్యాగ్ హాట్ టాపిక్ గా మారిపోయింది.

    మహేష్, నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్

    మహేష్, నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్

    అయితే మెగా అభిమానులు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్ చేస్తున్నారని.. అల్లు అభిమానులు కూడా తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ బాబు అభిమానులు నందమూరి అభిమానులు కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తాము అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ఎదిగినట్లుగా కూడా వారు మద్దతు ఇస్తున్నారు.

    ఈ గొడవ ఎక్కడ మొదలైంది?

    ఈ గొడవ ఎక్కడ మొదలైంది?

    అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది అనే వివరాల్లోకి వెళితే.. రాజకీయపరంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనే విషయం లో మెగా అభిమానులు ఇటీవల ఒక మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఫ్లెక్సీలలో అల్లు అర్జున్ ఫొటో పేరు గాని కనిపించలేదు. అంతే కాకుండా అక్కడ చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ పై మెగా అభిమానులలో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. ఒక వీడియో కూడా వైరల్ అయినట్లు చెబుతున్నారు. అసలు అల్లు అర్జున్ ను మెగా హీరోల్లో భాగం చేయడానికి కూడా ఇష్ట పడడం లేదనే టాక్ వచ్చింది. అంతే.. ఆ కారణంగా గొడవ కార్చిచ్చులా అంటుకుంది.

    కౌంటర్ గానే ఇలా..

    కౌంటర్ గానే ఇలా..

    కావాలనే మెగా అభిమానులు అల్లుఅర్జున్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చిన్నచూపు చూస్తున్నారని అల్లు అర్జున్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రతిచర్యగా 'ఏం పీకలేరు బ్రదర్' అనే మరొక పవర్ఫుల్ ట్యాగ్ ను కౌంటర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎవరి సపోర్ట్ లేకుండానే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా హీరో గా కొనసాగుతున్నారు అంటూ నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి. అయితే ఈ గొడవ పై మెగా హీరోలు, అల్లు అర్జున్ స్పందిస్తారో లేదో చూడాలి.

    English summary
    Shocking fight between mega fans and allu arjun fans behind the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X