2017 టాప్ స్టార్స్: ప్లాపైనా టాప్ ర్యాంక్స్, సౌత్‌లో ప్రభాస్ ఒక్కడే, అంతా షాక్!

By Bojja Kumar

Recommended Video

2017 టాప్ స్టార్స్.. సౌత్‌లో ప్రభాస్ ఒక్కడే ! | Filmibeat Telugu

ప్రపంచంలోని అన్ని సినిమాల వివరాలు, వాటికి ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్ ఏమిటి అనే విషయాలు వెల్లడిస్తూ ఇంటర్నేషనల్ వైడ్ పాపుల్ అయిన వెబ్ సైట్ 'ఇంటర్నెట్ మూవీ డాటాబేస్'(IMDb). తాజాగా ఈ వెబ్ సైట్ ఇండియాలో 2017 టాప్ 10 స్టార్స్ వివరాలు ప్రకటించింది.

 ర్యాకింగ్స్ ఇలా ఉన్నాయేంటి?

ర్యాకింగ్స్ ఇలా ఉన్నాయేంటి?

అయితే ఈ వెబ్ సైట్ ప్రకటించిన టాప్ 10 ర్యాకింగ్స్ చూసి సినీ ప్రేక్షక లోకం బిత్తరపోయింది. సినిమాలు ప్లాప్ అయిన స్టార్లు, అతిథి పాత్రలు పోషించిన స్టార్లకు టాప్ ర్యాంక్స్ దక్కడం, తమ సినిమాలతో హిట్స్ కొట్టిన వారు తర్వాతి స్థానంలో ఉండటం చూసి అభిమానులు షాకయ్యారు.

 తమన్నాకు 4వ ర్యాంక్ అతిపెద్ద షాక్

తమన్నాకు 4వ ర్యాంక్ అతిపెద్ద షాక్

ఈ ర్యాకింగ్స్ లిస్టులో అన్నింటికంటే పెద్ద షాక్ హీరోయిన్ తమన్నాకు 4వ స్థానం దక్కడం. ఈ ఏడాది తమన్నా నటించిన సినిమాలు 3 విడుదలయ్యాయి. ‘బాహుబలి 2' సినిమాలో ఆమె చిన్న అతిథి పాత్ర చేసింది. ఎన్టీఆర్ జై లవ కుశలో ఐటం సాంగ్ చేసింది. ఇక ఆమె హీరోయిన్ గా శింబుతో నటించిన తమిళ చిత్రం పెద్ద ప్లాప్ అయింది. మరి ఏ విధంగా తమన్నాకు 4వ ర్యాంకు వచ్చిందో తెలియక అంతా ఆశ్చర్య పోతున్నారు.

 ఈ ర్యాకింగ్స్ ఎలా డిసైడ్ చేశారు?

ఈ ర్యాకింగ్స్ ఎలా డిసైడ్ చేశారు?

‘ఐఎండిబి' ఈ ర్యాంకింగ్స్ ఎలా డిసైడ్ చేసింది అంటే..... తమ వెబ్ సైట్లో స్టార్ స్టార్ మీటర్ గణాంకాలు, పేజ్ వ్యూస్, ఏ స్టార్ ఎక్కువ కాలం టాప్ లో ఉన్నాడు అనే లెక్కల ధారంగా ఈ ర్యాకింగ్స్ విడుదల చేశారట.

నెం.1 స్థానంలో షారుక్ ఖాన్

నెం.1 స్థానంలో షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ లిస్టులో నెం.1 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది షారుక్ ‘రాయీస్', జబ్ హ్యారీ మెట్ సెజల్ అనే చిత్రాల్లో నటించారు.

 రెండో స్థానంలో అమీర్ ఖాన్

రెండో స్థానంలో అమీర్ ఖాన్

ఈ ఏడాది అమీర్ ఖాన్ ఒకే ఒక సినిమాలో నటించారు. ‘సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో పాటు ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు.

 మూడో స్థానంలో సల్మాన్ ఖాన్

మూడో స్థానంలో సల్మాన్ ఖాన్

ఈ ర్యాకింగ్స్‌లో సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ట్యూబ్ లైట్' చిత్రం మాత్రమే విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఫెయిలైంది. ఈ నెల చివర్లో ఆయన నటించిన ‘టైగర్ జిందా హై' సినిమా విడుదల కానుంది.

 నాలుగవ స్థానంలో తమన్నా

నాలుగవ స్థానంలో తమన్నా

ఎవరూ ఊహించని విధంగా తమన్నా 4వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది తమన్నా నటించిన సినిమాలు 3 విడుదలయ్యాయి. ‘బాహుబలి 2' సినిమాలో ఆమె చిన్న అతిథి పాత్ర చేసింది. ఎన్టీఆర్ జై లవ కుశలో ఐటం సాంగ్ చేసింది. ఇక ఆమె హీరోయిన్ గా శింబుతో నటించిన తమిళ చిత్రం పెద్ద ప్లాప్ అయింది.

 5వ స్థానంలో ఇర్ఫాన్ ఖాన్

5వ స్థానంలో ఇర్ఫాన్ ఖాన్

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఐఎండిబి ర్యాకింగ్స్ లో 5వ స్థానం దక్కించుకున్నారు.

6వ స్థానంలో ప్రభాస్

6వ స్థానంలో ప్రభాస్

ఐఎండిబి టాప్ 10 ర్యాంకింగ్స్‌లో సౌత్ నుండి కేవలం ప్రభాస్ కు మాత్రమే స్థానం దక్కింది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 7వ స్థానంలో అనుష్క శర్మ

7వ స్థానంలో అనుష్క శర్మ

ఐఎండిబి ర్యాంకింగ్స్ లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు 7వ స్థానం దక్కింది.

 అనుష్క శెట్టి

అనుష్క శెట్టి

తెలుగు హీరోయిన్ అనుష్క శెట్టికి ఐఎండిబి ర్యాంకింగ్స్ లో 8వ స్థానం దక్కింది. బాహుబలి ప్రాజెక్టుతో అనుష్క ఉత్తరాదిలో కూడా బాగా పాపులర్ అయింది.

 హృతిక్ రోషన్

హృతిక్ రోషన్

హీరో హృతిక్ రోషన్‌కు ఐఎండిబి ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం దక్కింది. ఈ ఏడాది హృతిక్ రోషన్ నటించిన చిత్రం ‘కాబిల్' మాత్రమే విడులైంది.

 కత్రినాకు 10వ స్థానం

కత్రినాకు 10వ స్థానం

హీరోయిన్ కత్రినా కైఫ్‌కు ఐఎండిబి ర్యాంకింగ్స్ లో 10వ స్థానం దక్కింది. అయితే ఈ ర్యాకింగ్స్ ప్రాపర్ గా లేవని అంటున్నారు సినీ అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X