షాకింగ్ నిజం రివీల్: స్టార్ హీరోయిన్ తో స్టార్ ప్రొడ్యూసర్ కి గొడవ ,తెర వెనక జరిగింది

కరణ్ జోహార్ కు, కరీనా కపూర్ కు మద్య గొడవ ఎందుకు వచ్చిందో కరణ్ వివరించారు.

By Srikanya

ముంబై: హీరోయిన్స్ కు, దర్శక నిర్మాతలకు మధ్య మనస్పర్ధలు రావడం సహజమే. అయితే కారణాలు అందరికి తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిపై ఏవేవో రూమర్స్ వినిపిస్తూంటాయి. కరణ్ జోహార్ ది తొలి నుంచీ మనస్సులో ఏది ఉంటే బయిటకు అది మాట్లాడే మనస్తత్వం. ఆయన రీసెంట్ గా ఏన్ అన్ సూటబుల్ బోయ్ అనే పుస్తకం రాసారు.

కరణ్ జోహార్ ఆత్మకథగా చెప్పబడుతున్న ఆ పుస్తకంలో అనేక అంశాలు వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసింది. అయితే ఆ పుస్తకంలో ఆయన ఇండస్ట్రీలోని హీరో,హీరోయిన్స్ తో ఉన్న రిలేషన్ గురించి, వారితో వచ్చిన విభేధాలు గురించి సైతం వివరించారు.

దాంతో ఇప్పటిదాకా ఇండస్ట్రీలో పజిల్ లాగ మిగిలిపోయిన అనేక విషయాలు వివరణ లభించినట్లైంది. ముఖ్యంగా ఆయనకు కరీనా కపూర్ కి మధ్య చాలా కాలంగా విభేధాలు వచ్చాయి. ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకోలేదు కూడా. అయితే వీళ్లద్దిరి మధ్యా ఏం జరిగిందో ఎక్కడా ఎప్పుడూ వివరించలేదు. తర్వాత కొంతకాలానికి మళ్లీ ఇద్దరూ ఒకటయ్యారు.

ఇండస్ట్రీలో అదొక అంతుపట్టని మిస్టరీగా పజిల్ లాగ ఉండిపోయింది. ఈ నేపధ్యంలో తన ఆత్మకథలో ఆ విషయాలను వివరించారు. చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం అది. అసలు కరీనా కపూర్ తో గొడవ ఎలా వచ్చింది. చివరకు ఎలా ప్యాచెప్ అయ్యారు అనే విషయాలు ఆయన రాసుకొచ్చారు. అదే మిటో మీరు ఇక్కడ చదవండి.

 డబ్బు ఎక్కువ

డబ్బు ఎక్కువ


కరణ్ ఏం రాసుకొచ్చారంటే... "కరీనా కపూర్‌ నటించిన 'ముజ్‌సే దోస్తీ కరోగీ' 2002లో విడుదలైంది. కానీ.. అదీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.
దీంతో కరీనా నిరుత్సాహపడింది. అయితే ఆ సినిమా విడుదలైన సమయంలోనే కరణ్‌జోహార్‌ తన అసిస్టెంట్‌ను దర్శకుడిని చేస్తూ 'కల్‌ హో నా హో' చిత్రం నిర్మించాడు. అందులో నటించమని కరీనా కపూర్‌ని అడిగాడట. అయితే.. ఆదిత్య చోప్రా దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన కూనల్‌ కోహ్లి 'ముజ్‌సే దోస్తీ కరోగీ'తో తనకు ఫ్లాప్‌ ఇవ్వడంతో కరణ్‌ జోహార్‌ వద్ద పనిచేసిన నిఖిల్‌ అద్వాణీపై నమ్మకం పెట్టుకోలేదట.

నాకూ అంతే ఇవ్వండి

నాకూ అంతే ఇవ్వండి

తనకు నిఖిల్ అద్వాణిపై నమ్మకం లేకపోవటంతో... కరణ్‌ నటించమని అడగ్గానే కరీనా.. అందులో హీరోగా నటిస్తున్న షారుక్‌ ఖాన్‌కి ఎంత పారితోషికం ఇస్తున్నారో అంతే మొత్తం తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేసిందట.

 మంచి హిట్టైంది కానీ..

మంచి హిట్టైంది కానీ..


దీంతో కరణ్‌ ఈ విషయాన్ని తన తండ్రితో చెబితే.. మరో హీరోయిన్‌ను తీసుకోమన్నారట. అలా ఆ చిత్రంలో షారుక్‌కి జంటగా ప్రీతిజింతా ఎంపికైంది. ఆ సినిమా మంచి హిట్టైంది. కానీ కరణ్ కు , కరీనా కు మధ్య దూరం పెంచేసింది. ఇద్దరూ ఈ ఇష్యూని వ్యక్తిగతంగా తీసుకున్నారు.

 ఎడమొహం పెడమొహంగా..

ఎడమొహం పెడమొహంగా..

అయితే.. కరీనా అలా అడగడంతో కరణ్‌ మనసు నొచ్చుకుందట. దీంతో కరీనాతో మాట్లాడటం మానేశాడట. పార్టీల్లో ఎదురైనా ఎడమోహం పెడమోహం పెట్టుకున్నారట. అలా ఏడాది ఒకరినొకరం మాట్లాడుకోలేదు. తలుచుకుంటే అవన్నీ చాలా సిల్లీగా ఉంటాయని పుస్తకంలో కరణ్‌ రాసుకొచ్చాడు.

 పుస్తకంలో చెప్పుకొచ్చాడు.

పుస్తకంలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం మంచి స్నేహితులుగా మెలుగుతున్న బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌.. దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ల మధ్య 2002 సమయంలో మనస్పర్ధలు ఏర్పడ్డాయని బీటౌన్‌లో చెప్పుకున్నారు. అందుకు గల కారణాలను కరణ్‌ జోహార్‌ ఇటీవల విడుదల చేసిన 'అన్‌ అన్‌సూటబుల్‌ బాయ్‌' పుస్తకంలో పేర్కొన్నారు.

తిరిగి పాచప్

తిరిగి పాచప్

తిరిగి తామిద్దరం ఎలా స్నేహితులం అయ్యామనే విషయం గురించి కరణ్ చెప్తూ... " ఆ సమయంలో మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అప్పుడు కరీనా కపూర్ నాకు ఫోన్ చేసింది. అది ఆగస్టు నెల. అప్పటికే మేమిద్దం మాట్లాడుకోవటం మానేసి దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది. ఆమె ఫోన్ చేసి.. నేను యష్ అంకుల్ గురించి విన్నాను అంటూ ఫోన్ లోనే ఎమోషన్ అయ్యిపోయింది. సారీ నేను నీతో టచ్ లో ఉండలేదు.డోంట్ వర్రీ..అంతా సర్దుకుంటుంది....ఐ లవ్యూ '." అంటూ ఫోన్ చేసింది. అప్పటి నుంచీ మళ్లీ ఒకటయ్యాం అంటూ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X