»   » హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులు... తెర వెనక ఏం జరిగిందంటే?

హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులు... తెర వెనక ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: తెలుగుతో పాటు పలు సౌత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్  ముగ్గురు వ్యక్తులు తనను కొడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి ఎర్నాకులంలో తన షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె ఫిర్యాదు చేసారు.

అయితే అదృష్టవశాత్తు హీరోయిన్  ఆ నిందితుల నుండి సురక్షితంగా బయట పడింది. జరుగరాని సంఘటన ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేసారు.

పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫేక్ యాక్సిడెంటుతో

ఫేక్ యాక్సిడెంటుతో

కారు కొచ్చిలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వద్దకు రాగానే హీరోయిన్ కారును టెంపోతో కావాలని ఢీ కొట్టి ఫేక్ యాక్సిడెంట్ చేసారు. కారులో ఉన్న మార్టిన్ డ్రైవర్‌ను పక్కు తప్పించి టెంపోలోని ఇద్దరు వ్యక్తులు కారులో ప్రవేశించినట్లు తెలుస్తోంది.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

కారును తమ ఆధీనంలోకి తీసుకున్న దుండగులు గంటన్నరపాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొచ్చి నగరంలో కారును తిప్పారని, ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

 పలరివట్లోమ్ జంక్షన్ వద్ద

పలరివట్లోమ్ జంక్షన్ వద్ద

ఆమె కారులోనే కిడ్నాప్ చేసి గంటన్నర పాటు తిప్పిన దుండగులు పలరివట్లోమ్ జంక్షన్ వద్ద కారును, ఆమెను వదిలి పారిపోయారు. ఒంటరిగా కారు నడుపుకుంటూ దగ్గర్లో తనకు తెలిసి నిర్మాత ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి... అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పని చేసిన డైవర్ పనేనా?

పని చేసిన డైవర్ పనేనా?

ఈ సంఘటన వెనక వద్ద గతంలో పని చేసిన డ్రైవర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ హస్తం ఉందని భావిస్తున్నారు. అతడిపై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ కక్షతోనే

ఆ కక్షతోనే

తనపై అనవసర, అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న కారణంతోనే అతడిని డ్రైవర్ గా తొలగించి మార్టిన్ అనే వ్యక్తిని నియమించుకుంది. అయితే ఈ సంఘటన తర్వాత మార్టిన్ మీద కూడా అనుమానాలు పెరిగాయి.

మార్టిన్ కు తెలిసే జరిగిందా?

మార్టిన్ కు తెలిసే జరిగిందా?

మార్టిన్ కు తెలిసే ఇదంతా జరిగిందా? అనే కోణంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టెంపో నుండి కొందరు వ్యక్తులు తన కారులోకి బలవంతంగా ప్రవేశించిన సమయంలో మార్టిన్ ప్రవర్తన అనుమానం గా ఉందని భావన పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మార్టిన్ సహాయంతోనే పల్సర్ సునీల్ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

అదుపులో ఒకరు, ఇద్దరి కోసం గాలింపు

అదుపులో ఒకరు, ఇద్దరి కోసం గాలింపు

పోలీసులు మార్టిన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

English summary
Bhavana, the popular actress was allegedly kidnapped and assaulted by her former driver and his friends. As per the reports, Bhavana's car was hijacked from Athani, Angamaly on February 18 midnight. Reportedly, the accused men created a fake accident and hijacked the actress's car from Athani. They have allegedly assaulted the actress and captured illicit photos and videos till they reached Palarivattom.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu