ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్...

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అనారోగ్యం కారణంగా ఇటీవల సికింద్రాబాద్ కిమ్స్ లో చేరినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆయన కేన్సర్ తో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన తన సొంతూ వెళ్లి ప్రశాంతంగా గడిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచాం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Shocking news about Ahuthi Prasad

ఆహుతి ప్రసాద్ ఆరోగ్య విషయాలు వెల్లడించడానికి ఆయన కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదు. ఈ విషయమై వారు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆహుతి ప్రసాద్ సన్నిహితులు, ఫ్రెండ్స్ ఆయన అనారోగ్యం వార్తలు విని ఆయనతో మాట్లాడటానికి, కలవడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. కొందరు ఆయన్ను కలవడానికి ఇంటికి వెళ్లినా కుటుంబ సభ్యులు ఆయన ఇంట్లో లేరని చెబుతున్నారని, ఫోన్ చేసినా ఆయన బిజీగా ఉన్నారు, మాట్లాడటం కుదరదు అని సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది.

క్రిష్ణా జిల్లా ముదినెపల్లి పక్కనున్న కోడూరు గ్రామానికి చెందిన ఆహుతి ప్రసాద్ తెలుగులో చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు. విలనిజం పండించడంలోనూ, హాస్యం పండించడంలోనూ ఆయనది అందెవేసిన చేయి. చందమామ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X