twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌కి వైసీపీ వల..! తెరవెనుక జరుగుతున్నదేంటి..?

    |

    Recommended Video

    Is Ysrcp Trying To Grab Jr NTR In Their Party ? || Filmibeat Telugu

    నందమూరి వారసుల్లో గొప్ప కీర్తి గడించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత తారక రామారావు పోలికలతో ఉండటమే గాక.. అచ్చం ఆయన లాంటి లక్షణాలే ఎన్టీఆర్ లో కనిపించడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సినిమాల్లో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తాత లాగే రాజకీయాల్లో కూడా రాణించే చాతుర్యం గలవాడని విశ్లేషణలు సాగుతున్నాయి. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన రానప్పటికీ ఎవరికీ తోచిన విధంగా వారు విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త షాకిస్తోంది. ఎన్టీఆర్ కోసం వైసీపీ వల వేస్తోందంటూ ఓ మీడియాలో ఆసక్తికర కథనం వెలువడింది. ఆ వివరాలేంటో చూద్దామా..

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేలమట్టం

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేలమట్టం

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నడ్డి విరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పాలైంది టీడీపీ పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు కూడా బీజేపీలోకి జంప్ అవుతున్నారు. చంద్ర‌బాబుకు అత్యంత సన్నిహితులు తప్పితే మిగితా నేతలంతా టీడీపీని వీడుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఇక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేలమట్టం అయినట్లే అని తెలుస్తోంది.

    ఆదుకునే నాయకుడు ఎన్టీఆర్

    ఆదుకునే నాయకుడు ఎన్టీఆర్

    గతంలో టీడీపీ పార్టీ పట్ల ఇంట్రెస్ట్ చూపి ప్రచారం కూడా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. ఎన్టీఆర్ దూరమవడంపై భిన్న వాదనలు వినిపించాయి.. కానీ దేనికీ స్పందించలేదు. అయితే తాజాగా జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాభవం చూసి టీడీపీని కాపాడే సత్తా ఎన్టీఆర్ కి మాత్రమే ఉందనే టాక్ బలంగా వినిపిస్తూ వచ్చింది.

    ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ వైసీపీ నేత.. హాట్ టాపిక్

    ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ వైసీపీ నేత.. హాట్ టాపిక్

    ఈ లోగా.. టీడీపీ పార్టీలో కీలక భూమిక పోషించి గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన కొడాలి నాని ఆత్మీయ అభినందన సభలో జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ పేర్ని వెంకట్రామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ ని నటుడిగా తీర్చిదిద్దింది కొడాలి నాని అని, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం విడదీయరానిదని ఆయన పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది.

    వైసీపీలో ఎన్టీఆర్ మామ

    వైసీపీలో ఎన్టీఆర్ మామ

    ఇటీవలే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీ తీరడం పుచ్చుకొని కీల‌క బాధ్య‌త‌లు చేపట్టారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌ బంధువులు, కొంత మంది స్నేహితులు వైసీపీలో యాక్టివ్ గా ఉండ‌టం ప‌ట్ల‌ తార‌క్ సంతోషంగా ఉన్నాడ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అంటే వైసీపీ పార్టీ విజయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఆనందంగా ఉన్నారనేది కొందరు వైసీపీ నేతల మాట.

    వైసీపీ వల వేస్తోందా? తాజా పరిణామాల్లో అర్థాలేంటి..?

    వైసీపీ వల వేస్తోందా? తాజా పరిణామాల్లో అర్థాలేంటి..?

    ఓటమి తర్వాత టీడీపీ బాధ్యతలు చేపట్టాలని వచ్చిన వార్తల పట్ల ఎన్టీఆర్ స్పందించకపోవడం, అదేవిధంగా కొందరు వైసీపీ నేతలు ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ అంశం ప్రాతిపదికనే.. తార‌క్‌ని ఎలాగైనా వైసీపీలోకి లాగేయాలని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఓ మీడియా కథనం వెలువడింది. నిజానికి తాజా పరిణామాలు చూస్తుంటే జనాల్లో డౌట్ వచ్చేస్తోంది. చూడాలి మరి ఇకనైనా ఎన్టీఆర్ స్పందిస్తాడా? లేదా? అనేది.

    టీడీపీ వర్గాలు సహా షాక్ అవుతున్న జనం

    టీడీపీ వర్గాలు సహా షాక్ అవుతున్న జనం

    వైసీపీ, జూనియర్ ఎన్టీఆర్ కి వల వేయడం అనే వార్త విని టీడీపీ వర్గాలు సహా జనమంతా షాకవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబుతో సఖ్యత ఉన్నా, లేకున్నా టీడీపీ పార్టీ బ్రతికుండగా ఓ నందమూరి హీరోపై వైసీపీ కన్ను పడటం జీర్ణించుకోలేని విషయం. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అని, వీటిని పెద్దగా పట్టించుకోవద్దని అంటున్నారు విశ్లేషకులు.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got prestigious win. In this situation junior ntr is only person to give stand tdp party in Ap. But as par latest news ycp encourage junior ntr to join in their party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X