twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అల.. వైకుంఠపురములో' టీమ్‌కి షాక్.. పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

    |

    అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపడుతున్నారు యూనిట్ సభ్యులు. ఇంతలో ఈ సినిమా టీమ్‌పై కేసు నమోదు కావడం అందరికీ షాకిస్తోంది. ఇంతకీ 'అల.. వైకుంఠపురములో' కేసు ఎందుకు నమోదైంది? ఎక్కడ పొరపాటు జరిగింది? వివరాల్లోకి పోతే..

    ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అభిమానుల తాకిడి

    ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అభిమానుల తాకిడి

    'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. హైదరాబాద్ నగరంలోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈవెంట్ చూసి ఎంజాయ్ చేయడానికి అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తారు. ఒకదశలో అభిమానులను కంట్రోల్ చేయడం కష్టతరమైంది.

    జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు

    జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు

    అయితే ఈ ఈవెంట్ నిర్వాహకుల మీద కేసులు నమోదు కావడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న శ్రేయాస్ సంస్థ ఎండీ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ గణేష్‌పై ఈ కేసులు నమోదయ్యాయి.

     అనుమతుల ఉల్లంఘన.. తొక్కిసలాట

    అనుమతుల ఉల్లంఘన.. తొక్కిసలాట

    పోలీసులకు ఇచ్చిన సమచారం మేరకు.. 'అల.. వైకుంఠపురములో' ఈవెంట్ నిర్వాహకులు పోలీస్ అనుమతులను ఉల్లంఘించారని, ఇచ్చిన సమయం కంటే ఎక్కువగా ఉండి.. అర్ద్రరాత్రి వరకు వేడుక నిర్వహించారనే కారణంతో ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల కారణంగా తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    రాత్రి 11:30 గంటల వరకూ

    రాత్రి 11:30 గంటల వరకూ

    అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ మందికి పాసులు ఇవ్వడం, పైగా కార్యక్రమం రాత్రి 11:30 గంటలకు వరకు కొనసాగడంతో ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. అనుమతులకు విరుద్ధంగా గడువు ముగిసిన తరువాత కూడా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు.

    నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఎస్‌ఐ ఫిర్యాదు

    నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఎస్‌ఐ ఫిర్యాదు

    పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్‌లు ఇచ్చామని చెప్పిన నిర్వాహకులు దాదాపు 15వేల మందిని ఆహ్వానించినట్లుగా గుర్తించారు. పైగా చెప్పిన దానికంటే అధిక సమయం ఈవెంట్ నిర్వహించారు. ఈ మేరకు నిర్వాహకుల నిర్లక్ష్యం తీవ్ర అసౌకర్యానికి, తొక్కిసలాటకు కారణమైందని వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ నవీన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.

    English summary
    Allu Arjun and trivikram new movie Ala Vaikutapuramlo. This movie pre release event done very much grandly. Now poilce case filed on this event organisers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X