Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రక్తపు మడుగులో హీరోయిన్.. న్యూ ఇయర్ రోజు ఇంత ఘోరంగానా!
ఆపిల్ పిల్లగా యువత హృదయాల్లో గూడు కట్టుకున్న హన్సిక తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టీనేజ్ వయసులో దేశముదురు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అందాలు ఆరబోసింది. ఆ ఆపిల్ బ్యూటీ గ్లామర్ కు యువత ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ అమ్మడి చేష్టలు చూస్తుంటే అదే యువత గుండెల్లో గుబులు రేగడం ఖాయం. ప్రస్తుతం హన్సిక తమిళ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. అది కూడా గ్లామర్ తగ్గించేసి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం హన్సిక నటిస్తున్న మహా చిత్రం వరుసగా వివాదాలు సృష్టిస్తోంది.
వరుసగా వివాదాలు
హన్సిక అందానికి తమిళనాడులో గుడి కట్టేశారు కూడా. అలాంటిది హన్సిక క్రేజ్. కానీ హన్సిక మాత్రం అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటోంది. జమీల్ ఈ చిత్రానికి దర్శకుడు. హుక్కా తాగుతూ, సాధువులు హన్సిక కాళ్ళ వద్ద ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తీవ్ర వివాదం సృష్టించింది. హిందూ సంఘాలు ఈ చిత్రంపై మండిపడ్డాయి. ఈ వివాదంపై హన్సిక మాట్లాడుతూ మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. ఈ మాత్రం దానికే ఇలా అయిపోతే ఎలా.. ఇంకా చాలా ఉంది అంటూ కామెంట్స్ చేసింది.
చెప్పింది నిజమే
తాజాగా విడుదల చేస్తున్నా మహా చిత్ర పోస్టర్స్ చూస్తే హన్సిక చెప్పింది నిజమే అనిపిస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల సుహాసిని పోస్టర్ ఘోరంగా ఉంది. హన్సిక రక్తపు మడుగులో క్రూరంగా ఉన్న పోస్టర్ ని వదిలారు. బాత్ టబ్ నిండా రక్తం. ఆ టబ్ లో హన్సిక తుపాకీతో ఫోజు ఇస్తోంది. మహా చిత్రం భయంకరమైన హర్రర్ చిత్రంగా ఈ పోస్టర్ చూస్తే అనిపిస్తుంది.
గ్లామర్ పాత్రలకు దూరం
ఇటీవల హన్సిక మాట్లాడుతూ తాను ఇకపై గ్లామర్ పాత్రలు చేయనని తేల్చి చెప్పేసింది. హన్సిక అందానికి తమిళనాడులో గుడి కట్టేసారు కూడా. అలాంటి హన్సిక ఈ నిర్ణయం తీసుకుందంటే తన ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశకు గురిచేయడమే అవుతుంది. మహా చిత్రంతో హన్సిక నుంచి ఇంకెన్ని ఘోరాలు చూడాలో అని అభిమానులు అంటున్నారు.
50వ చిత్రం
ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసి బోర్ కొట్టిందో ఏమో కానీ హన్సిక మహా చిత్రంతో హర్రర్ జోనర్ ని ఎంచుకుంది. హన్సికకు ఇది 50వ చిత్రం. ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని ఇప్పటికే హిందూ సంఘాలు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు ఈ చిత్రంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.