సీడెడ్‌లో అరవింద సమేత ధర.. దిమ్మ తిరిగేలా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఏ చిత్రం చుట్టూ నెలకొని ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీరిలీజ్ బిజినెస్ ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.

సీమ ఫ్యాక్షన్
చాలా కాలం తరువాత టాలీవుడ్ లో వస్తున్న నిఖార్సైన ఫ్యాక్షన్ చిత్రం అరవింద సమేత. పైగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. దీనితో అభిమానుల్లో కనీ వినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి.

భారీ ధర
అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సీడెడ్ లో ఈ చిత్రానికి దిమ్మ తిరిగే ఆఫర్ అందినట్లు వార్తలు వస్తున్నాయి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రానికి 15 కోట్ల భారీ ధర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా షాకింగ్ ప్రెస్ అని చెప్పుకోవచ్చు.

మూడవ స్థానంలో
అరవింద సమేతకు ఈ డీల్ ఒకే అయితే సీడెడ్ లో మూడవ స్థానంలో నిలిచిన చిత్రం అవుతుంది. 25 కోట్లతో బాహుబలి మొదటి స్థానంలో, అజ్ఞాతవాసి 16.20 కోట్లతో రెండవ స్థానంలో, రంగస్థలం 12.10 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నాయి. తాజగా అరవింద సమేత 15 కోట్లతో మూడవస్థానంలోకి వచ్చిందని చెప్పొచ్చు.
Recommended Video


దసరా కానుకగా
అక్టోబర్ లో ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రం పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications











