ఏంటి రవితేజ స్టామినా.. నమ్మగలరా!
విజయాల పరంగా కాస్త జోరు తగ్గినప్పటికీ మాస్ మహా రాజా రవితేజ సత్తా మాత్రం ఇప్పటికి అలాగే ఉంది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో రవితేజది ప్రత్యేకమైన శైలి. రవితేజ కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీ అభిమానులని విపరీతంగా ఆకర్షిస్తాయి. టచ్ చేసి చూడు వంటి పరాజయం తరువాత రవితేజ నేల టికెట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మే చివరి వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే విధంగా జరుగుతూ ట్రేడ్ పండితులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నేల టికెట్టు టార్గెట్ అదే
రవితేజ చిత్రం నుంచి అభిమానులు ఎక్కువగా వినోదాన్ని కోరుకుంటారు. నెల టికెట్టు చిత్రం కూడా పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నా కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

రాజా ది గ్రేట్ ఒక్కటే
ఈ మధ్య కాలంలో రవితేజ చిత్రాల్లో రాజా ది గ్రేట్ చిత్రం మాత్రమే ఆకట్టుకుంది. విజయాల పరంగా రవితేజ జోరు తగ్గిందనే చెప్పాలి. మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న రవితేజ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు.

షాకిచ్చిన శాటిలైట్ రైట్స్
రవితేజ నటిస్తున్న నెల టికెట్టు హిందీ శాటిలైట్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ రూ 12 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కారణం అదేనా
నెల టికెట్టు చిత్ర శాటిలైట్ రైట్స్ తెలుగులో కంటే హిందీలో ఎక్కువ ధర పలకడం విశేషం. ఈ చిత్ర తెలుగు శాటిలైట్ రైట్స్ 8 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. హిందీలో డబ్ అవుతున్న తెలుగు చిత్రాలకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే క్రేజ్ ఉన్న ప్రతి తెలుగు చిత్రానికి మంచి ధర వెచ్చించి హిందీ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











