twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ ఎలా చనిపోయారంటే.. వాటర్ బాటిల్ కోసం, కొంప ముంచిన ఒక్క క్షణం!

    |

    Recommended Video

    హరికృష్ణ కొంప ముంచిన వాటర్ బాటిల్...!

    నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సినీరాజకీయ ప్రముఖుల్ని విస్మయానికి గురిచేస్తోంది. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే వివాహ కార్యక్రమాన్ని హాజరుకావాలని హరికృష్ణ ఈ ఉదయం తెల్లవారు జామున 4:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో నల్గొండ సమీపంలో హరికృష్ణ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఏ ప్రమాదానికి గల కారణాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పోలిసుల విచారణలో తేలిన ప్రమాద కారణాలని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మీడియాకు వివరించారు.

    అతివేగం

    అతివేగం

    మీడియాతో రంగనాథ్ మాట్లాడుతూ.. హరికృష్ణగారు మృతి చెందడానికి ప్రధాన కారణం అతివేగం. కారు గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించడంతో అదుపు కోల్పోయినట్లు వివరించారు.

     వాటర్ బాటిల్

    వాటర్ బాటిల్

    క్షణ కాలంలో ప్రమాదం జరిగిపోయింది.వాహనం వేగంగా ప్రయాణిస్తోంది. డ్రైవ్ చేస్తున్నది హరికృష్ణే. వాటర్ బాటిల్ కోసం వెనక్కితిరిగారు. క్షణాల్లో ముందున్న రాయిపైకి కారు ఎక్కేసింది. వెంటనే డివైడర్ ని ఢీ కొట్టడంతో 15 అడుగులు గాల్లోకి ఎగిరినట్లు ప్రత్యక్ష సాక్షులు ద్వారా తెలిసిందని రంగనాథ్ అన్నారు.

    సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే

    సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే

    160 కిమీ వేగం, పైగా వాహనం గాలికి ఎగిరి ఒక్కసారిగా కిందపడడంతో హరికృష్ణ 30 అడుగుల దూరంలో పడ్డట్లు తెలుస్తోంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వలనే ఆయనే కింద పడిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటె కనీసం ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ప్రాణాపాయం తప్పేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    ఇష్టమైన డ్రైవింగ్ వలనే

    ఇష్టమైన డ్రైవింగ్ వలనే

    హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత ఎన్నికల ప్రచార రథాన్ని స్వయంగా హరికృష్ణ రాష్ట్రమంతా వేల కిమీ నడిపారు. కొత్త వాహనాల్ని నడపడం అంటే ఆయనకు చాలా మక్కువ. అంత ఇష్టమైన డ్రైవింగ్ వలనే ఇప్పుడు ఆయన ప్రాణాలు విడిచారు.

    నల్గొండలోనే

    నల్గొండలోనే

    గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నల్గొండలో ప్రమాదానికి గురై గాయపడ్డాడు. అదే నల్గొండ జిల్లాలో తన సోదరుడు, తండ్రి ప్రమాదానికి గురై మరణించారు. నందమూరి కుటుంబానికి ఇది ఆందోళన కలిగించే అంశమే.

    English summary
    Shocking reason behind Harikrishna death. Nalgonda SP Ranghanath reveals
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X