»   » షాకింగ్.... పవన్ కళ్యాణ్ కోట్ల సంపాదన ఇలా ఖాళీ అవుతోంది!

షాకింగ్.... పవన్ కళ్యాణ్ కోట్ల సంపాదన ఇలా ఖాళీ అవుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంటర్వ్యూలలో, సభల్లో తన వద్ద డబ్బుల్లేవు... అంటూ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రకటన చేయడంపై కొందరు బహిరంగంగానే విమర్శించారు.

అయితే పవన్ కళ్యాణ్ సంపదన, ఖర్చు గురించి వివరాలు సేకరించి ఓ జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పవన్ తన కోసం, తన కుటుంబం కోసం భవిష్యత్ అవసరాలకు గానూ ఆయన పెద్దగా డబ్బు సేవ్ చేయలేదని, ఆయన చాలా సాధారణ జీవితం గడుపుతాడని ప్రశంసలు గుప్పించింది.

Shocking reasons Behind Pawan Kalyan earnings

మరి ఇలాంటివేమీ లేకుండా పవన్ కళ్యాణ్ సంపాదన ఎలా ఖాళీ అవుతోందనే దానికి సమాధానంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. పవన్‌తో ఎల్లప్పుడూ ఉండే 12 మంది ఆఫీస్ సిబ్బంది, ఫామ్ హౌస్‌లో పనిచేసే మరో 25 మందికి జీతాలు ఇవ్వడానికి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికే ఆయన ఎక్కువ ఖర్చు చేస్తున్నారట.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే పవన్ 12 మందిని వ్యక్తిగత భద్రతాసిబ్బంది(బౌన్సర్స్)గా పెట్టుకున్నాడని, వారికిచ్చే జీతాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని సదరు కథనంలో పేర్కొంది. గత మూడేళ్లలో పవన్ కళ్యాణ్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే అని, అందుకే ఆయన సంపాదన అంతా అలా కరిగిపోతోందని వివరించింది.

ఇక పవన్ కళ్యాణ్ కు దయాగుణం ఎక్కువ.... సహాయం కావాలని ఎవరు అడిగినా కాదనకుండా ఇచ్చే చేయి ఆయనది. కొన్ని విషయాల్లో ఆయనే స్వయంగా ముందుకొచ్చి సహాయం చేస్తుంటారు. అందుకే ఆయన వద్ద పెద్దగా డబ్బుల్లేకుండా పోయాయనేది ఆ కథనం సారాంశం.

English summary
Shocking reasons Behind Pawan Kalyan earnings, cost.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu