యాంకర్ సుమపై తప్పుడు ప్రచారం.. అసలు నిజం ఇదే!

టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు సుమ కనకాల. యాంకర్ గా ఏ క్షణాన కెరీర్ స్టార్ట్ చేసిందో గాని ఊహించని విదంగా స్టార్ యాక్టర్స్ కంటే ఎక్కువ క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం హాట్ యాంకర్స్ ని డామినేట్ చేస్తున్న సుమ జనాలను ఎట్రాక్ట్ చేయడంలో వారికంటే పవర్ఫుల్ అనే చెప్పాలి. టీవీ షోలు, ప్రీ రోలీజ్ ఈవెంట్స్ లలో యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సుమపై ఇటీవల ఒక షాకింగ్ రూమర్ వచ్చింది.

 టాప్ యాంకర్..

టాప్ యాంకర్..

తన మాటలతో హావభావాలతో ఒక పద్దతిలో ఆకట్టుకునే యాంకర్ సుమ కనకాల అప్పుడప్పుడు నటిగా కూడా బిగ్ స్క్రీన్ పై మెరిసింది. నటిగా కొనసాగాలని అనుకున్న సుమ ఆ తరువాత యాంకర్ గానే స్థిరపడిపోయింది. ఊహించని విదంగా అందరికంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ అందుకుంది. సుమ ఎలాంటి షో చేసినా కూడా రేటింగ్స్ లో రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే

అల్లు అర్జున్ సిస్టర్..?

అల్లు అర్జున్ సిస్టర్..?

ఇటివల సుమపై ఒక తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆమె అల్లు అర్జున్ సోదరిగా కనిపించే ఛాన్స్ ఉన్నట్లు ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. పుష్ప పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో ఇతర భాషల్లో కూడా ఈ రూమర్ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. దాదాపు ఇది నిజమేనని కథలో చాలా సరదాగా కనిపించే రోల్ అని టాక్ వచ్చింది.

నిజం కాదు..

నిజం కాదు..

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సుమ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోయే ఛాన్స్ ఉందని అల్లు అర్జున్ సోదరిగా నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే చిత్ర యూనిట్ ఈ రూమర్ గురించి విని షాక్ అవుతోంది. అందులో ఎలాంటి నిజం లేని దర్శకుడు కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా వచ్చే ఎడాఫీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
సుమక్క ఇప్పుడు కూడా బిజీ..

సుమక్క ఇప్పుడు కూడా బిజీ..

లాక్ డౌన్ అనంతరం బుల్లితెరపై రోజు కనిపించే వారు ఆర్థికంగా గట్టి దెబ్బ తిన్నారు. ఇక రోజు టీవీలో కనిపించేవారు సోషల్ మీడియాకు షిఫ్ట్ అయ్యారు. సుమ కూడా యూ ట్యూబ్ లో సరదాగా వీడియోలు చేస్తూ బిజిగా గడుపుతోంది. లాక్ డౌన్ ముందు ఆ తరువాత కూడా సుమక్క బిజిగానే ఉందని ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X