»   » ప్రభాస్ గురించి షాకింగ్ రూమర్లు

ప్రభాస్ గురించి షాకింగ్ రూమర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhas
హైదరబాద్: సినిమా వాళ్లపై రకరకాల పుకార్లు చెలరేగడం సహజమే కానీ...యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మాత్రం ఈ మధ్య పలు షాకింగ్ రూమర్లు తరచూ ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ మధ్య ప్రభాస్ బాహుబలి సెట్లో గాయపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవన్నీ నిరాధారమైన రూమర్లు అని తర్వాత తేలింది.

తాజాగా అలాంటి రూమర్లే మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. గుర్రపు స్వారీ చేస్తూ ప్రభాస్ క్రింద పడిపోయాడని, అతని తలకు బలమైన గాయమైందని...కోమాలోకి వెళ్లాడనే ప్రచారం మొదలైంది. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని, ప్రభాస్ బాగానే ఉన్నాడని, షూటింగులో పాల్గొంటున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు స్పష్టం చేసారు.

సినిమా వివరాల్లోకి వెళితే...ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

English summary
Some shocking rumours spreading about Prabhas’s health once again and claimed that the actor was in a coma after falling down from a horse. None of this is true. Prabhas is perfectly fine. The macho actor is participating in the shoot quite enthusiastically.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu