అలా ఉంటే సుశాంత్ సింగ్ బ్రతికేవాడు.. లాక్ డౌన్ కూడా అతని మరణానికి మరో కారణం!

సినిమా ఇండస్ట్రీకి నిజంగా 2020 అనేది ఒక కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. అసలే పనులు లేక ఎంతో మంది కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే.. ఊహించని మరణాలు మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక అసలు మిస్టరీ ఏమిటనే దానిపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇకపోతే లాక్ డౌన్ కూడా సుశాంత్ మరణానికి ఒక కారణం అయ్యి ఉండవచ్చని అంటున్నారు. అందుకు సన్నిహితులు ఒక ఉదాహరణ కూడా చెప్పారు.

Recommended Video

Sushant Singh Rajput A Good Hearted Person, See This Video
ఎంత మంచివాడు అంటే..

ఎంత మంచివాడు అంటే..

కష్టపడే గుణమున్న సుశాంత్ సింగ్ హీరోగా ఎదగడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సందర్బల్లో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు అయినప్పటికీ తన గోల్ ని మర్చిపోకుండా ఒక క్రమశిక్షణతో మెలిగాడు. సుశాంత్ గుణం ఎంత మంచిది అంటే.. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన జీవించే పేదలు ఎగబడి వస్తే.. తోటి సెలబ్రెటీస్ దూరంగా పరిపోగా.. సుశాంత్ మాత్రం ఒక్కరిని కూడా దూరం నెట్టకుండా వారిని ఆప్యాయంగా హద్దుకుంటూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చాడు.

ఆర్థిక సహాయాలు..

ఆర్థిక సహాయాలు..

సుశాంత్ కొన్ని సేవా సంస్థలను కూడా నడుపుతున్నాడు. కొంతమంది అనాధ ఆడపిల్లలకు సొంత ఖర్చులతో చదివిస్తూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు అభిమానుల కోరిక మేరకు సేవా స్వచ్ఛంద సంస్థలలో పాల్గొంటూ తనవంతుగా ఆర్థిక సహాయం కూడా చేస్తూ వచ్చాడు. పలు సంధర్భాల్లో కోటి రూపాయల వరకు విరాళాలు ఇచ్చాడు.

గత ఆరు నెలలుగా..

గత ఆరు నెలలుగా..

ఇకపోతే సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనక అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు. సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం అతను గత ఆరు నెలలుగా డిప్రెషన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఇన్స్టాగ్రామ్ లో తల్లి ఫొటో పెడుతూ ఎమోషనల్ గా కామెంట్ చేయడం చూస్తుంటే సుశాంత్ తీవ్ర మనోవేదనకు లోనయినట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ లేకపోయి ఉంటే..

లాక్ డౌన్ లేకపోయి ఉంటే..

సాధారణంగా షూటింగ్ ఉంటే సుశాంత్ వేరే పనులేమి పెట్టుకోడని ఒకవేళ లాక్ డౌన్ లేకపోయి ఉంటే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండేవాడేమో అంటున్నారు అతని సన్నిహితులు. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా సుశాంత్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒంటరితనం అతన్ని బాధకు లోను చేసి ఉండవచ్చని అంటున్నారు. 2020నిజంగా ఒక దరిద్రంగా మారింది అని బాలీవుడ్ సెలబ్రెటీస్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X