వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్.. దిల్ రాజు మరో ప్రయత్నం?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైతే బజ్ ఎలా ఉంటుందో ఇటీవల వచ్చిన ట్రైలర్ ద్వారా చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. కేవలం ట్రైలర్ కోసమే హార్డ్ కోర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఎగబడ్డారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తుండగా హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చినట్లుగా రూమర్స్ వస్తున్నాయి.

ట్రైలర్ తో న్యూ రికార్డ్
ఇటీవల విడుదలైన ట్రైలర్ 25గంటల్లోనే గత రికార్డులన్నింటిని బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. అత్యదిక లైక్స్, వ్యూవ్స్ అందుకున్న మొట్టమొదటి ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. నిజంగా ట్రైలర్ తోనే పవర్ స్టార్ ఈ రేంజ్ లో రికార్డుల బెండు తీస్తాడాని ఊహించలేదు.

థియేటర్స్ లో అభిమానుల జోష్
థియేటర్స్ లో ఫ్రీగా ట్రైలర్ చూడొచ్చని ఎనౌన్స్మెంట్ రాగానే పవన్ అభిమానులు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే కొన్ని చోట్ల ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. మారికొన్ని చోట్ల థియేటర్స్ అద్దాలు కూడా పగిలిపోయాయి. థియేటర్స్ యాజమాన్యాలు అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు.

పర్మిషన్ ఇవ్వలేదా?
ఇక అందరి చూపు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది. వేడుక కోసం పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముందుగానే దిల్ రాజు టీమ్ హైదరాబాద్ పోలీసుల అనుమతులు కోరింది. అయితే పర్మిషన్ ఇవ్వలేదనే టాక్ వస్తోంది. రిజెక్ట్ చేసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెనక్కి తగ్గని దిల్ రాజు?
ప్రస్తుతం కోవిడ్ ఎక్కువవుతున్న కారణంగానే అనుమతులు ఇవ్వలేదని సమాచారం. ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దిల్ రాజు మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో వెనక్కి తగ్గేలా లేరని అనిపిస్తోంది. ఎలాగైనా ఏదో ఒక ఈవెంట్ తో సినిమాపై బజ్ పెంచాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











