For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్‌ తల్లిని తిట్టిన ఎఫెక్ట్: శ్రీరెడ్డి ఇష్యూ కొత్త మలుపు, ఆ విషయం లీక్ చేసి గాయిత్రి సంచలనం!

  By Bojja Kumar
  |

  పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేయడం, పరోక్షంగా ఆయన తల్లిని తిట్టే విధంగా బూతు పదజాలం వాడటంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు కాస్టింగ్ కౌచ్ అంశంలో శ్రీరెడ్డికి సపోర్టుగా ఉన్న వారంతా ఆమెపై తిరగబడటం ప్రారంభించారు.

  Pawan Kalyan Severly Blamed By Sri Reddy

  మీడియాలో ఫేం వచ్చిందని శ్రీరెడ్డి రెచ్చిపోతోందని, మద్దతు ఇవ్వలేదనే కారణంతో పవన్ కళ్యాణ్ లాంటి వారిని అత్యంత హేయమైన పదజాలంతో దూషించడం, వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇండస్ట్రీ నుండి పలువురు ఆర్టిస్టులు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ తదితరులు శ్రీరెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు.

  మొన్న కాస్టింగ్ కౌచ్ అంశంపై మహిళా సంఘాల చర్చలో పాల్గొన్న వారు కూడా తాము శ్రీరెడ్డికి చేష్టలకు సపోర్టు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. కాగా, కాస్టింగ్ కౌచ్ అంశంపై మంగళవారం మహా టీవీ ఛానల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

  శ్రీరెడ్డి మీద అలాంటి ఓపీనియన్ అప్పటి నుండి ఉంది

  శ్రీరెడ్డి మీద అలాంటి ఓపీనియన్ అప్పటి నుండి ఉంది

  గతంలో శ్రీరెడ్డి ఓ ప్రముఖ మీడియా సంస్థలో పని చేసింది. అదే సంస్థలో ఆమెతో కలిసి గాయిత్రి కూడా పని చేశారు. తాజాగా చర్చా కార్యక్రమంలో గాయిత్రి గుప్తా మాట్లాడుతూ.....శ్రీరెడ్డి మీద సెడక్ట్రెస్ అనే ఒపీనియర్ ఆ మీడియా సంస్థలో పని చేస్తున్నప్పటి నుండి ఉంది.... అని గాయిత్రి చెప్పుకొచ్చారు. ఐయామ్ సారీ శ్రీ... నేను నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నించడం లేదు. నేను నీ వెనకాల విన్న మాటలను బట్టి చెబుతున్నాను అని గాయిత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

  నీకు సపోర్టు చేయలేను

  నీకు సపోర్టు చేయలేను

  నీకు ఎందుకు సపోర్టు చేయాలనే విషయంలో నాకు క్లారిటీ లేదు. దేన్ని బేస్ చేసుకుని నేను నీకు సపోర్ట్ చేయాలి. నువ్వు ఈ విషయంలో నాకు ఎప్పుడూ కాల్ చేయలేదు. కనీసం మీడియా ఛానల్స్ ను అప్రోచ్ అయినపుడు కూడా చెప్పలేదు. నువ్వు మీడియా ముందు సరిగా మాట్లాడి ఉంటే సపోర్ట్ ఇచ్చేద్దాన్నేమో? నేను నిన్ను షేమ్ చేయడానికి ప్రయత్నించడం లేదు. నా పాయింట్ అర్థం చేసుకో..... అంటూ గాయిత్రి వ్యాఖ్యానించారు.

  శ్రీరెడ్డితో అంత సాన్నిహిత్యం లేదు

  శ్రీరెడ్డితో అంత సాన్నిహిత్యం లేదు

  సరిగ్గా సంవత్సరం క్రితం శ్రీరెడ్డితో ఓ ఫోటో దిగాను. మీడియా సంస్థ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక పార్టీలో కాకుండా శ్రీరెడ్డిని నా లైఫ్‌లో కలవడం అది మూడోసారి. మీడియా సంస్థలో ఉన్నపుడు కూడా మా మధ్య హ్యాంగ్ ఔట్ అయ్యేంత ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఒకరికొకరం తెలుసు...హాయ్ హలో అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు.... అని గాయిత్రి తెలిపారు.

  అభి ఫోటోలు చూపి ఆడుకుందామని చెప్పింది

  అభి ఫోటోలు చూపి ఆడుకుందామని చెప్పింది

  సంవత్సరం క్రితం షూట్ లొకేషన్ కోసం అడగటానికి వెళ్లినపుడు ఆమె కనిపిస్తే దిగిన ఫోటో ఇది. అపుడు నెంబర్ ఎక్సేంజ్ చేసుకున్నాము. అపుడు శ్రీరెడ్డి నాకు కాల్ చేసి ‘నా దగ్గర అభి ఫోటోస్ ఉన్నాయి. వి కెన్ ప్లే విత్ హిమ్, ఇద్దరం కలిస్తే చాలా ఆడుకోవచ్చు' అని చెప్పింది. ఆ కాల్ నిజమా? కాదా? అని శ్రీరెడ్డిని అడగండి... అంటూ చర్చా వేదికలో గాయిత్రి గుప్తా ప్రశ్నించింది.

  గొల్లున ఏడ్చిన శ్రీరెడ్డి.....

  గొల్లున ఏడ్చిన శ్రీరెడ్డి.....

  గాయిత్రి గుప్తా ఆ విషయాలు బయట పెట్టడంతో.... శ్రీరెడ్డి గొల్లున ఏడ్చేసింది. సార్ నేను పోరాటం చేసి చేసి అలిసిపోయాను. నేను ఈ పోరాటంలో ఓడిపోయాను. వీటిని ఎదుర్కోవడం నా వల్ల కాదు. నన్ను పర్సనల్ గా ఇంత టార్గెట్ చేస్తారని అనుకోలేదు. ఒక ఆడ పిల్లగా ఇది తట్టుకోలేను. నేను జీవితంలో తప్పులు చేశానని ఒప్పుకుంటున్నాను. అభి ఫోటోలు నా వద్ద ఉన్నాయని ఆ అమ్మాయికి చెప్పలేదు. ఇండస్ట్రీలో అలా జరుగుతున్నపుడు ప్లే చేయడంలో తప్పేముంది.... అంటూ శ్రీరెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు.

  పవన్ కళ్యాణ్ మదర్ కూడా నీ లాగే ఏడుస్తుంది: నటి రాధ

  పవన్ కళ్యాణ్ మదర్ కూడా నీ లాగే ఏడుస్తుంది: నటి రాధ

  శ్రీరెడ్డి అలా ఏడుస్తుండటంతో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నటి రాధా మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ తల్లి కూడా నువ్వు నిన్న అన్న మాటలకు ఇలాగే ఏడుస్తూ ఉంటుంది అంటూ ఆమెపై ఫైర్ అయ్యారు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నటి అపూర్వ, రాధ.... పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

  ఇంతకీ శ్రీరెడ్డి అంత ఘోరమైన మాట ఏమందంటే...

  ఇంతకీ శ్రీరెడ్డి అంత ఘోరమైన మాట ఏమందంటే...

  నిన్న (ఏప్రిల్ 16) కాస్టింగ్ కౌచ్ అంశంపై ప్రెస్ మీట్ అనంతరం బయటకు వచ్చిన శ్రీరెడ్డి అక్కడ తనకు ఎదురైన ఛానల్స్‌తో మాట్లాడుతూ..... ‘‘పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు అయి ఉండి పోరాటం చేస్తున్న మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లాలని ఆయన మాకు సలహాలు ఇస్తున్నారు. ఈ విషయం ఆయన చెప్పే వరకు మాకు తెలియదు మరి అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను అన్న(య్య) అని పిలిచినందుకు నా చెప్పు తీసుకుని కొట్టుకుంటున్నాను అంటూ కెమెరాల ముందే తనను తాను చెప్పుతో కొట్టుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది శ్రీరెడ్డి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద అర్జున్ రెడ్డి మూవీ బూతు డైలాగ్ మాదా*****త్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌కు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయింది.''

  పవన్ తల్లికి సారీ చెబుతూ శ్రీరెడ్డి పోస్ట్

  పవన్ తల్లికి సారీ చెబుతూ శ్రీరెడ్డి పోస్ట్

  పవన్ కళ్యాణ్ తల్లికి సారీ చెప్పడంతో పాటు మరో పోస్టు కూడా శ్రీరెడ్డి చేశారు. ఒక్క మాట పవన్ గారి "అమ్మ" ని అంటే ఇన్ని భూతులు తో మెసేజ్ లు పెడుతున్నారు.... ఇదేనా ఆడవారికి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ... మేము పోరాడేది కూడా రెస్పెక్ట్ కోసమే.... వాళ్ళ అమ్మ కేనా గౌరవం..? మాకు లేదా...? ఇంతమంది అమ్మాయిలం రోడ్ మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే పవన్ గారు మీరే ముందుకు వచ్చి న్యాయం చేయమని ఇండస్ట్రీ పెద్దలని కూర్చోబెట్టి ప్రశ్నించవచ్చుగా....? లేదా మీ ఫాన్స్ మా ఆడవాళ్ళని తిట్టే మెసేజ్ లు చూడవచ్చుగా...? "దయచేసి మమ్మల్ని తిట్టే ఈ మెసేజ్ లని పవన్ గారు చదవండి".... వీడియో క్రింద ఉన్న ఏ మెసేజ్ డిలీట్ చెయ్యట్లేదు... మీ ఫాన్స్ చిల్లర చేష్టలు అర్ధం అవుతాయి.... మీ నాయకత్వానికి మీ ఫాన్స్ యెంత మచ్చ తీసుకొస్తున్నారో దయచేసి చూసుకోండి... అని వ్యాఖ్యానించారు.

  English summary
  Shocking Secrets Of Sri Reddy Revealed By Gayatri Gupta.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X