షాకింగ్ న్యూస్.. స్టార్ హీరోయిన్ అరెస్ట్.. సెన్సేషనల్ వీడియో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారా..? ఈ వీడియో చూస్తే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆమె రెండు చేతులకు బేడీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. దీంతో ప్రస్తుతం సోనాక్షి ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

నేనేం తప్పు చేయలేదు.. అరెస్ట్ చేయలేరు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో రెండు చేతులకు బేడీలు ధరించి కనిపిస్తున్న హీరోయిన్.. నేనేం తప్పు చేయలేదు, మీరు నన్ను అరెస్ట్ చేయలేరు అంటూ అరిచినట్లు కనిపిస్తోంది. దీంతో అసలు ఇదంతా నిజంగా జరిగిందా? లేదా ఫేక్ వీడియోనా? అనే కోణంలో చర్చలు ముదిరాయి.

నిజంగానా.. లేక సినిమా లోనా..?
డ్రెస్‌ని బట్టి చూస్తే ఈ వీడియోలో బేడీలతో ఉంది సోనాక్షి సిన్హానే అని తెలుస్తోంది. దీంతో ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఇది నిజంగానా.. లేక సినిమా లోనా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఈ వీడియోలో కనిపిస్తోంది సోనాక్షి కాదు అని కొట్టేపారేస్తున్నారు.
మొత్తంగా చూస్తే అసలు విషయం తెలియరాలేదు గానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.
ఇటీవలే పోలీస్ కేసు.. పలు అనుమానాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఇటీవలే సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు యూపీ పోలీసులు ఆ కేసును విచారించాల్సిందిగా ముంబై పోలీసులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తమై యూపీ పోలీసులు, ముంబై పోలీసుల సమక్షంలో సోనాక్షి సిన్హా ఇంటికి వెళ్లడం, ఆ సమయంలో సోనాక్షిసిన్హా ఇంట్లో లేకపోవడంతో లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో తాజా సోనాక్షి అరెస్ట్ వీడియోపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి.

సోనాక్షి సిన్హా సినిమాలు
అక్షయ్ కుమార్ సరసన మిషన్ మంగళ్ సినిమాలో, సల్మాన్ ఖాన్ దబాండ్ 3 చిత్రంలో అలాగే మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటిస్తోంది సోనాక్షి సిన్హా. ఇటీవలే విడుదలైన కందాని షఫాఖానా సినిమాలో కూడా సోనాక్షి నటించింది.


Click it and Unblock the Notifications











