»   » పాపం అనుష్క: జక్కన్నా...! మరీ ఇలానా...!!

పాపం అనుష్క: జక్కన్నా...! మరీ ఇలానా...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి 2' క్లైమాక్స్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ బాహుబలి కంక్లూజన్ ఔట్ ఫుట్ పై రాజమౌళి సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ విషయంలో మాత్రం రాజమౌళి సీరియస్ అవుతున్నట్లు సమాచారం.

ఆ స్టోరీలోకి వెళితే, బాహుబలి తొలి భాగంలో 'దేవసేన' గా అనుష్క కేవలం ఓల్డేజ్ గెటప్ లో మాత్రమే కనిపించింది. కానీ, 'బాహుబలి 2' లో మాత్రం అనుష్క రోల్ చాలా కీలకం. ముఖ్యంగా బాహుబలి ప్రియురాలిగా, భల్లాలదేవుడు ఆశపడే అమ్మాయిగా, అందాల రాణిగా దేవసేన అలరించనుంది. అయితే, ఇప్పుడు దేవసేనకు సంబంధించిన సీన్స్ తెరకెక్కించడానికి అనుష్క సైజ్ సెట్ కావడం లేదని ప్రచారం జరుగుతుంది.

Shocking!!! SS Rajamouli Warned Anushka

'సైజ్‌ జీరో' అంటూ అక్కర్లేని ప్రయోగాలు చేసి చిక్కుల్లో పడింది అనుష్క. అప్పుడు పెరిగిన బరువు ఇప్పటికీ తగ్గకపోవడంతో రాజమౌళి ఆమెకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడట.అందులోనూ అనుష్క లైపోసక్షన్ లాంటి అసహజ పద్ధతుల ద్వారా కాకుండా కేవలం నేచురల్ గానే బరువు తగ్గాలని డిసైడ్ అవడంతో సైజ్ తగ్గే విషయంలో ఆలస్యం అవుతుందని సమాచారం.

యోగా ద్వారా ఫలితం ఉండదని లైపో ట్రీట్‌మెంట్‌ తీసుకోమని అనుష్కకు రాజమౌళి గట్టిగా చెప్పాడట! మరో ఆరు వారాల్లో బరువు తగ్గి షూటింగ్‌కి హాజరు కావాలని కూడా అన్నాడట! ఓ విధంగా వార్నింగ్‌లా ఉన్న రాజమౌళి మాటలు విన్న అనుష్క ఇప్పుడు అయోమయంలో పడింది. యోగాతో పాటు డైటింగ్‌, ఎక్సర్‌సైజులు విపరీతంగా చేస్తూ బరువు తగ్గించుకోవడానికి అమ్మడు బాగానే కష్టపడుతున్నప్పటికీ, ఇవి ఏవీ రాజమౌళి పట్టించుకోకుండా అలాంటి మాటలు మాట్లాడడం అనుష్కను బాధించాయని తెలుస్తోంది.

English summary
Director SS Rajamouli has warned Actress Anushka Shetty over weight loss issue. It is said that the successful Baahubali director has warned Anushka to lose her weight at the end couple months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu