twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR లుక్ పై Trolls: ఫ్యాన్ మెడ్ పోస్టర్ కంటే దారుణం.. రాజమౌళి రేంజ్ ఎక్కడ.. ఇదెక్కడ?

    |

    జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గత రెండేళ్ల నుంచి వేడుకలకు దూరంగానే ఉన్నారు. అరవింద సమేత పూర్తి స్థాయిలో అయితే ఆకట్టుకోలేదు. ఓ వర్గం అభిమానులే ఆ సినిమాపై విమర్శలు చేశారు. ఇక RRR తో రాజమౌళి ఎలాగైనా పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తాడాని ఒక నమ్మకం అయితే ఉంది. అయితే పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సరైన ఆనందం దక్కడం లేదు. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ తో అభిమానుల్లో నిరాశ ఎక్కువగా కనిపిస్తోంది.

    ఈ సారి మాత్రం..

    ఈ సారి మాత్రం..

    దేశవ్యాప్తంగా RRR అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ వంటి పాత్రల్లో నటిస్తుండడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాల డోస్ మరింత ఎక్కువవుతోంది. అయితే ఇదివరకు పోస్టర్స్ టీజర్స్ అభిమానులను అంచనాలను అందుకున్న దర్శకుడు జక్కన్న ఈ సారి మాత్రం అంచనాలను అందుకోలేదని అంటున్నారు.

    ఊహించినంత లేదు

    ఊహించినంత లేదు

    ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గత ఎడాది టీజర్ రాలేదు. కరోనా వల్ల చాలా ఆలస్యంగా వచ్చింది. ఇక ఈసారైనా మంచి కిక్కిస్తారని అనుకుంటే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. అసలు పోస్టర్ ఊహించినంత లేదు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. రాజమౌళి నుంచి ఇది ఎవరు ఊహించారని అంటున్నారు.

    ఫ్యాన్ మెడ్ పోస్టర్ అంటూ

    ఫ్యాన్ మెడ్ పోస్టర్ అంటూ

    అఫీషియల్ గా RRR పోస్టర్ ఏదైనా రిలీజ్ చేస్తారని అనుకుంటే ఇలా ఫ్యాన్ మెడ్ పోస్టర్ విడుదల చేశారు ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆ ట్రోలింగ్స్ చూస్తే దర్శకుడు రాజమౌళి పోస్టర్ ను డిలీట్ చేయించి కొత్తది రిలీజ్ చేయకుండా ఉండలేడు. ఆ రేంజ్ లో ట్రోల్స్ వెలువడుతున్నాయి.

    Recommended Video

    Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
    ఇలా ఉంటే ఎలా..?

    ఇలా ఉంటే ఎలా..?

    దాదాపు 400కోట్లకు పైగా ఖర్చు చేసి తీస్తున్న పాన్ ఇండియా సినిమా పోస్టర్ ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే మంచిది మేము కూడా ఎడిట్ చేయగలం అంటూ చాలెంజ్ విసురుతున్నారు. ట్రోలింగ్స్ డోస్ అయితే తగ్గడం లేదు. మరి రాజమౌళి ఆ విషయంపై ఏదైనా వివరణ ఇస్తాడో లేదో చూడాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు చాలామంది సినీ తారలు శుభాకంక్షాలు తెలుపుతున్నారు.

    English summary
    There is however a belief that Rajamouli with RRR will be fully satisfied anyway. However, the fans were not happy about the birthday. Disappointment among fans seems high with the recently released poster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X