విశాల్ ఆఫీసులో సోదాలు, కట్టలకొద్దీ డబ్బు: వైరల్ అవుతున్న ఆ వీడియో చూడండీ
ఇటీవల హీరో విజయ్ నటించి "మెర్శల్" చిత్రంలో జీఎస్టీ విధానానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తమిళనాడు బీజేపీ శాఖ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పైగా, ఈ చిత్రం పైరసీ వీడియోను తిలకించి ఈ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే రాజకీయ నేతలు పైరసీ సీడీని చూడటాన్ని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకతాటిపైకి వచ్చింది.
Recommended Video


విశాల్ ఫిల్మ్ కంపెనీలో సోదాలు
ఈనేపథ్యంలో విశాల్‌కు చెందిన చెన్నైలోని సినీ నిర్మాణ సంస్థపై వస్తు సేవల పన్ను ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక వడపళనిలోని విశాల్ ఫిల్మ్ కంపెనీలో సోదాలు జరగడంతో ఒక్కసారి తమిళ సినీపరిశ్రమలో కలకలం రేగింది.

జీఎస్టీ అధికారులు
ఒక పక్క జీఎస్టీ అధికారులు లేనే లేదని చెబితే విశాలేమో దాడులు జరిగాయనీ, సోదాలు చేశారనీ చెప్పాడు, మొత్తం ఈ వ్యవహారమే ఒక మిస్టరీగా మారింది. ఇటీవల కోలీవుడ్ హీరో, తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఆఫీసులో వస్తు సేవల పన్ను నిఘా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విశాల్ ఫిల్మ్ కంపెనీలో సోదాలు
వడపళనిలోని విశాల్ ఫిల్మ్ కంపెనీలో సోదాలు జరపడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. విశాల్ తమిళ్ మూవీ మెర్సల్‌కు మద్దతు ప్రకటించడం వల్లే సోదాలు జరిగినట్టు సినీ వర్గాలు భావించాయి. అయితే ఆ సోదాల్లో అధికారులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ తాజాగా ఈ ఐటీ రైడ్స్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
విశాల్ ఇంట్లో రైడ్స్ సీన్‌గా చిత్రీకరించి
సోదాల్లో కళ్లు చెదిరే డబ్బు వెలుగు చూసిందనేది ఆ వీడియో సారాంశం. నిజానికి ఆ వీడియో విశాల్, అర్జున్ కలిసి నటిస్తున్న మూవీ ఇరంబు తిరై సినిమాలోని ఓ సీన్. అది విశాల్ సొంత సినిమా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సినిమాలోని ఓ చిన్న సన్నివేశాన్ని విశాల్ ఇంట్లో రైడ్స్ సీన్‌గా చిత్రీకరించి కొందరు వైరల్ చేస్తున్నారు. విశాల్ మాత్రం ఇది తన చిత్ర ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందని లైట్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











