షాకింగ్.. కాజల్‌కి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు భార్య.. ఏకంగా తంతా అంటూ
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ విషయం అందరికీ తెలిసిపోతోంది. ముఖ్యంగా సెలెబ్రిటీల విశేషాలు, వారి నడుమ వివాదాలు అన్నింటికీ సోషల్ మీడియానే వేదికగా మారుతోంది. ఈ కోవలోనే తాజాగా మంచు విష్ణు భార్య విరానికా.. కాజల్ అగర్వాల్‌కి వార్నింగ్ ఇవ్వడం సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ జరిగిందేంటి? స్టార్ హీరోయిన్ కాజల్‌కి, మంచు విరానికా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వివరాల్లోకి పోతే..

మంచు విష్ణు- విరానికా దంపతులు.. నాలుగో సంతానం
మంచు వారబ్బాయి, యంగ్ హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మరోవైపు ఆయన భార్య విరానికా కూడా అంతే యాక్టీవ్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం కాగా.. ఇప్పుడు మరొకరిని కనేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం విరానికా నిండు గర్భిణీ. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమ కుటుంబ విషయాలకు సంబందించిన అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్న మంచు విష్ణు ఇటీవల ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు.
కాజల్‌ని ఇరికించిన మంచు విష్ణు
ప్రస్తుతం గర్భంతో ఉన్న విరోనికా డెలవరీని ఇన్‌స్టా పేజీలో లైవ్ పెట్టేస్తా అని ఆ పోస్ట్ సారాంశం. ఎన్నో డిస్కషన్స్, డిబేట్స్ తర్వాత తన భార్య డెలవరీని లైవ్‌లో ఇద్దామనుకుంటున్నానంటూ విష్ణు పేర్కొన్నాడు. పైగా ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్యూ కాజల్ అంటూ ఆమెను కూడా ఇరికించాడు మంచు విష్ణు.
కాజల్‌కి విరానికా వార్నింగ్
దీంతో ఈ పోస్ట్ చూసిన విరానికా వెంటనే రియాక్ట్ అయింది. ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చినందుకు కాజల్ నిన్ను తంతా.. . ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచించను అంటూ లవ్ గుర్తు ఎమోజీతో పోస్ట్ పెట్టింది విరానికా. పాపం! ఇలా ఎరక్కపోయి ఇరుక్కుపోయి కాజల్ అగర్వాల్.

విరానికా రియాక్షన్ చూసి విష్ణు
విరానికా రియాక్షన్ చూసిన మంచు విష్ణు చివరగా మరో పోస్ట్ తో ఈ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కొన్ని కారణాల వల్ల తన నిర్ణయం మార్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. విరానికకు మోహన్ బాబు సపోర్ట్ కూడా ఉండటం కారణంగా తన డిసిషన్ మార్చుకోక తప్పడం లేదని చెప్పాడు విష్ణు. భార్య భర్తల మధ్య జరిగిన ఈ ట్వీట్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇందుకు కారణం కాజల్ అడ్డంగా బుక్కవడమే.

ప్రస్తుతం కాజల్
సీనియర్ హీరోయిన్ గా దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్ ఇటీవలే సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోయినా వరుస సినిమాలతో బిజీ అయింది. ఆమె నటించిన రణరంగం మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











