Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'అరెవో సాంబా!' మెక్ మోహన్ కన్నుమూత
బ్లాక్ బస్టర్ 'షోలే' చిత్రంలోని దృశ్యాలను రక్తికట్టించిన 'సాంబా' ఇక లేరు. సాంబా పాత్రలో జీవించిన నటుడు మెక్ మోహన్ (71) సోమవారం కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస వదిలారు. మెక్ మోహన్ అసలు పేరు...మోహన్ మాఖిజానే. ఆయన బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు మేనమామ. సునీల్‌దత్ సహాధ్యాయి. వీరిద్దరూ లక్నోకు చెందినవారే. మోహన్ తొలుత రంగస్థలంపై తన ప్రతిభ నిరూపించుకున్న 1964లో 'హఖీకత్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 46 ఏళ్ల సినీ జీవితంలో 175కు పైగా చిత్రాల్లో నటించారు. చాలా సినిమాల్లో ప్రధాన విలన్ గ్యాంగ్‌లో ఒకరిగానే కనిపిస్తారు. 'షోలే'లో సినిమాలో 'సాంబా' పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చింది. అమితాబ్ తో కలిసి మోహన్ జంజీర్, డాన్, మజ్బూర్, సత్తే పే సత్తా, షాన్, దోస్తానా, ఖూన్ పసీనా, కాలా పత్తర్, హేరాఫెరీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మెక్ మోహన్ నటించిన చివరి సినిమా...'లక్ బై చాన్స్'. ఆయన మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలుపుతోంది.