twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవర్‌‍గ్రీన్ గ్రేట్ మూవీ ‘షోలే’కు 36 ఏళ్లు

    By Bojja Kumar
    |

    భారతీయ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ గ్రేట్ మూవీగా చరిత్రకెక్కిన సినిమా 'షోలే". ఆగస్టు 15, 9175 లో విడుదలైన ఈ సినిమా నేటితో 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను జి.పి. సిప్పి నిర్మించగా....అతని కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే.

    ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయో‌‍క్తి కాదేమో. 36 ఏళ్ల కిందటే రూ. 3 వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు. తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది.

    షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అంతుకే అప్పటికీ ఇప్పటికే...భారతీయ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.

    English summary
    'Sholay' movies Celebrating 36 Years. It is considered among the greatest films in the history of Indian cinema. Released on 15 August 1975.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X