సారి చెప్పిన హీరో...సమస్య సర్దుబాటు

By Staff

Saif Ali Khan
మొన్న ఆదివారం పాటియాలా రైల్వై స్టేషన్ వద్ద మీడియాకీ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కీ జరిగిన వివాదం మొత్తానికి ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. మీడియా ఫోటోగ్రాఫర్లపై దాడికి పాల్పడిన అభియోగాలపై సైఫ్ అలీఖాన్‌పై పాటియాలా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి సైఫ్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే సైఫ్ తానే ముందుకొచ్చి సారి చెప్పటంతో ఈ సమస్య ముగిసిందిట.

'థ్రీ ఇడియట్స్' సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సైఫ్ ఆదివారం పాటియాలా రైల్వే స్టేషన్ వచ్చారు. ఇద్దరు మీడియా ఫోటోగ్రాఫర్లు ఆయన్ను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఫోటోలు తీయవద్దని సైఫ్ అభ్యంతరం చెప్పినా ఫోటోగ్రాఫర్లు పట్టించుకోకుండా తమ పని కానిచ్చారు. దీంతో సైఫ్ బాడీగార్డులు సదరు ఫోటోగ్రాఫర్లపై దాడి చేసి వారి కెమెరాలను ధ్వంసం చేశారు. దీన్ని ఖండిస్తూ పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. సైఫ్ ఆదేశాల మేరకు వారి బాడీగార్డులు తమపై దాడి జరిపినట్టు ఫోటోగ్రాఫర్లు తమ ఫిర్యాదులో తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించి సదరు ఫోటోగ్రాఫర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫ్ అలీఖాన్‌తో సహా అయిదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడా సమస్య సారీ చెప్పటంతో తీరినట్లు చెప్తున్నారు. ఇరు వర్గాల వారినీ కూర్చోపెట్టి సర్ధుబాటు చేసే ప్రక్రియలో ఈ చిత్ర నిర్మాతగా సైఫ్ ముందుగా సారీ చెప్పాడుట. దాంతో వారు శాంతించి కేసు విత్ డ్రా చేసారుట.

ఇక అదే సమయంలో స్టేషన్ లోకి వచ్చిన దాదర్ ఎక్సప్రెస్ ని ఓ పావు గంటసేపు ఆందోళన కారులు ఆపుచేయటంపై మాత్రం విమర్శలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఈ సమయంలో పట్టించుకోకుండా నిలబడిపోవటం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనిపై ఉన్నతాధికారులకూ పిర్యాదులు చేసారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X