పంతులమ్మ పాత్ర టిపికల్ అంటున్న కావ్యాసింగ్
కావ్యాసింగ్, ఆర్యమన్ కాంబినేషన్‌లో సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ఐ లవ్ యూ టీచర్' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత ఆనంద్ తెలిపారు.
దర్శకుడు శ్రీసత్య మాట్లాడుతూ- 'పాత్రలకు తగ్గ నటీనటులను ఎన్నుకొని, నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీస్తున్నాం. ముంబాయికి చెందిన కావ్యాసింగ్ టీచర్ పాత్రను అద్భుతంగా పోషిస్తోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆర్యమన్ ఈ సినిమా స్టూడెంట్‌గా బాగా చేస్తున్నాడు కానీ ముద్దు సీన్‌లో నటించడానికి మొదట ఇబ్బంది పడినా తరువాత మొహమాటం లేకుండా నటించాడు. సన్నివేశపరంగా ఆర్టిస్టులు ఇన్ వాల్వ్ అయి నటించినప్పుడే సీన్ రక్తి కడుతుంది. ఆసక్తికరమైన సంఘటనలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
'ఈ సినిమాలో నాది టిపికల్ టీచర్ పాత్ర. వెరీ ఇంటెలిజెంట్ టీచర్. గ్లామర్ కూడా కలిగిన ఇటువంటి పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని కావ్యాసింగ్ తెలిపింది. ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీసత్య.


Click it and Unblock the Notifications











