twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద హీరోల షూటింగ్‌ షెడ్యూల్స్‌

    By Staff
    |

    తెలుగు సినిమాకు మూలస్తంభాలు వంటి పెద్ద హీరోలు నలుగురూ షూటింగ్‌ షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్నారు.

    ఎ.ఎస్‌. మురుగుదాస్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న స్టాలిన్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ ఆగస్టు 5తో పూర్తవుతుంది. ఇంతవరకూ జరిగిన షూటింగ్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. దీనితో ఈ సినిమాలో ఫైట్స్‌ షూట్‌ చేయడం దాదాపు పూర్తయినట్లే. ఇక రెండు పాటలు మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయిక. ఎగ్జిక్యుటివ్‌ నిర్మాత బి. మధు. సెప్టెంబర్‌ చివరివారంలో విడుదలకు సిద్ధం అవుతుంది.

    విక్టరీ వెంకటేశ్‌ ప్రస్తుతం సెల్వరాఘవన్‌ (7జి బృందావన్‌ కాలనీ ఫేమ్‌) దర్శకత్వంలో ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన త్రిష, మరో కథానాయికగా కమిలినీ ముఖర్జీ నటిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసాయిదేవ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎన్‌.వి. ప్రసాద్‌, శానం నాగ అశోక్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

    నాగార్జున హీరోగా బాస్‌ - ఐ లవ్‌ యూ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో బుధవారం (ఆగస్టు 3) నుంచి ప్రారంభం అయింది. నయనతార, పూనమ్‌ బజ్వా, శ్రియ (ప్రత్యేక పాత్రలో) నటిస్తున్నారు. డి. శివప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య. సెప్టెంబర్‌ చివరివారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. కల్యాణి మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు.

    బాలకృష్ణ హీరోగా శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్‌ పతాకంపై చంద్రముఖి ఫేమ్‌ పి. వాసు దర్శకత్వంలో వాకాడ అప్పారావు నిర్మిస్తున్న చిత్రం మూడో షెడ్యూల్‌ జూలై 31తో పూర్తయింది. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఆగస్టు 9 నుంచి ప్రారంభం అయి సెప్టెంబర్‌ 1 నాటికి షూటింగ్‌ పూర్తవుతుంది. స్నేహ, మీరా జాస్మిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు గురుకిరణ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X