బెడ్రూం సీన్లు మరీ ఇంత హాటుగానా..? (ఫోటోలు)
ముంబై : కండల వీరుడు జాన్ అబ్రహం, సెక్సీ లేడీ కంగనా రనౌత్ జంటగా బాలీవుడ్లో 'షూటౌట్ ఎట్ వాడాల' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈచిత్రం హాట్ స్టిల్స్ శృంగార ప్రియుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జాన్-కంగనా ఈ చిత్రంలో బెడ్రూం సీన్లలో యమ హాటుగా నటించి ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మే 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా A సర్టిఫికెట్ జారీ చేసింది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్, అనురాధా గుప్తా, సంజయ్ గుప్తా, గోంపో ఠాకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
1982లో ముంబై పోలీసులు చేసిన ఎన్ కౌంటర్లో మరణించిన గ్యాంగ్‌స్టర్ మాన్యా సర్వే జీవితం ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా బాడీని బిల్డ్ చేసిన జాన్ అబ్రహం పాత్రలో జీవించాడని, ఆయన పోసించిన పాత్రకు మంచి పేరొస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
మిగతా వివరాలు స్లైడ్ షోలో...

ఈ చిత్రంలో కంగనా రనౌత్ విద్యా జోషి పాత్ర చేస్తోంది.

అనిల్ కపూర్ ఏసిపి భగవాన్ పాత్రలో నటిస్తున్నారు. భగవాన్ చేతిలోనేనే మాన్య సర్వే ఎన్ కౌంటర్‌కు గురవుతాడు.

తుషార్ కపూర్ షేక్ మునీర్ పాత్రలో కనిపించనున్నాడు, పోలీస్ కమీషనర్ పాత్రలో జాకీష్రాఫ్ నటించారు.

మనోజ్ బాజ్ పాయ్ జుబైర్ ఇంతియాజ్ హస్కర్ పాత్రలో, సోనుసూద్ దిల్వార్ ఇంతియాజ్ హస్కర్ పాత్రలు పోషించారు.

సన్నీ లియోన్, సోఫీ చౌదరి ఈ సినిమాలో స్పెషల్ సాంగుల్లో ప్రేక్షకులను అలరించనున్నారు


Click it and Unblock the Notifications











