'షాపింగ్ మాల్' ఆడియో కి ఛీఫ్ గెస్ట్ గా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి షాపింగ్ మాల్ చిత్రం ఆడియో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 19 న శిల్పకళావేదికలో భారీగా జరపనున్నాడు. తమిళ 'అంగాడితెరు' చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి 'షాపింగ్ మాల్' పేరిట అనువదిస్తున్నారు. ఇక సురేష్ కొండేటి గతంలో ప్రేమిస్తే చిత్రాన్ని డబ్బింగ్ చేసి నిర్మాతగా మారారు. ప్రేమిస్తే తర్వతా సురేష్ కొండేటి... రామ్ గోపాల్ వర్మ సమర్పణలో రవితేజ హీరోగా వచ్చిన షాక్ ని తెలుగులో చేసారు. అయితే ఆ సినిమా ప్లాఫ్ అవటం ఆర్ధికంగా దెబ్బ తీసింది.
చిరకాల విరామం తర్వాత సురేష్ మరో తమిళ సినిమాను షాపింగ్ మాల్ పేరుతొ తెలుగులోకి అనువదిస్తున్నారు.ఇక ఈ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. అలాగే ఈ చిత్రానికి కూడా ప్రేమిస్తే తరగాలోనే పబ్లిసిటిని భారీగా చేస్తున్నాడు సురేష్. మహేష్, అంజలి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంథోని, జి.వి. ప్రకాష్‌కుమార్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సహ నిర్మాత: ఊటుకూరి నాగార్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య శ్రీనివాస్ బలువు, నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: జి. వసంతబాలన్.


Click it and Unblock the Notifications











